
Greatness Of Charity
చాలా మంది దోషాలను నివారించుకోడానికి, భగవంతుని కృపను పొందటం కోసం దాన ధర్మాలను చేస్తూ ఉంటారు. వారిని లోకం ధనవంతులుగా గుర్తిస్తుందే గానీ గొప్ప వాళ్ళుగా కాదు.
కానీ తమ కోసం దాచుకున్నది కూడా పరులు ఆపదలో ఉన్నప్పుడు ఇచ్చివేసే వాళ్ళు మహాత్ములు. భగవంతుడు ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటాడు.
దానం చేయగలగడం ఎంతో గొప్ప లక్షణం. దాన గుణం ఉన్నచోట భగవంతుడు ప్రత్యక్షమవుతాడని నిరూపించే కథ తెలుసుకుందాం.
3. రంతిదేవుని దాన గుణానికి ప్రతిఫలం (Rantidev’s Gift is Rewarded)
రంతిదేవుడు తన వద్ద ఉన్న నీటిని కూడా దానం చేయగానే బ్రహ్మాది దేవతలు అతని ఎదుట ప్రత్యక్షమైనారు. జరిగినదంతా విష్ణుమాయా విలాసమని అతనికి వివరించారు. అతని దానగుణాన్ని వేనోళ్ల కొనియాడారు.
వరాలు పొందడానికి ఎంతో మంది కఠోర తపస్సులు చేసినా దర్శనమివ్వని దేవతలు అతని సద్గుణాలను ప్రశంసించడానికి స్వయంగా ప్రత్యక్షమైనారు.
అయినా రంతిదేవుడు వారిని ఏ కొరికా కోరలేదు. విష్ణుభక్తులకు ఆయన నామస్మరణకు మించిన వరమేమివ్వగలరు ఎవరైనా…!
అందుకే అన్నమయ్య ‘ఏ పురాణమున ఎంత వెదకినా శ్రీ హరిదాసులు చెడరెన్నడునూ’ అని అన్నాడు. ఆ హరి భక్తులు ఎల్లప్పుడూ పుణ్యకార్యాసక్తులై ఉంటారు అనడానికి రంతిదేవుడు గొప్ప ఉదాహరణ.