
కృతజ్ఞత – ఒకరి దగ్గర సహాయం పొందినప్పుడు దాన్ని మర్చిపోకుండా ఉండటం.
కానీ ఈ రోజుల్లో ఒకరు మనకు సహాయం చేశారంటే వాళ్ళకు మననుంచి ఏదో అవసరం ఉంటుంది, అందుకే సహాయం చేశారు అనుకునే వాళ్ళు ఎక్కువయ్యారు.
చాలా సార్లు సహాయంచేసే వాళ్ళు కూడా ప్రతిఫలం ఆశించే చేస్తున్నారు. అలాంటివారికి కనువిప్పు కలిగించే కథ ఒకటి తెలుసుకుందాం.
3. దేవేంద్రుని వరం
ఓ చిలుకా నీకు ఈ ధర్మములు ఎవరు నేర్పించారు? అని ఇంద్రుడు అడుగగా ఆ చిలుక – ‘స్వామీ నేను నా ధర్మములు సక్రమంగా నిర్వర్తించడం తప్ప మరొకటి ఎరుగను.
చిన్న తనం లో నా తలిదండ్రుల సేవ చేశాను. నా భార్యా పిల్లలకు ఎలోటూ రాకుండా చూసుకున్నాను. అసత్యాన్నీ, దొంగతనాన్నీ ఎరుగను. నా చుట్టుపక్కల వారిని గౌరవించాను. ఇంతకు మించి నాకేమీ తెలియదు.’ అంది.
చిలుక మాటలకు సంతోషించిన దేవేంద్రుడు ఏమి వారం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడాచిలుక ‘ నాకే కోరికలూ లేవు. ఈ చెట్టు నాకు ఆహారాన్నీ , ఆశ్రయాన్నీ ఇచ్చింది.
ఈ చెట్టు మళ్ళీ చిగురించేలా చేయండి’ అని కోరింది. దేవేంద్రుడు ఆ చెట్టుని మళ్ళీ ఫలవంతం చేసి, జన్మాంతం లో ఆ చిలుకకు మోక్షాన్ని ప్రసాదించాడు.
Super Gratitude and good meaning