
కృతజ్ఞత – ఒకరి దగ్గర సహాయం పొందినప్పుడు దాన్ని మర్చిపోకుండా ఉండటం.
కానీ ఈ రోజుల్లో ఒకరు మనకు సహాయం చేశారంటే వాళ్ళకు మననుంచి ఏదో అవసరం ఉంటుంది, అందుకే సహాయం చేశారు అనుకునే వాళ్ళు ఎక్కువయ్యారు.
చాలా సార్లు సహాయంచేసే వాళ్ళు కూడా ప్రతిఫలం ఆశించే చేస్తున్నారు. అలాంటివారికి కనువిప్పు కలిగించే కథ ఒకటి తెలుసుకుందాం.
1. దేవతల తీర్థయాత్ర
స్కాంద పురాణం లోని కథ ఇది. ఒక నాడు బ్రహ్మదేవుని ఉపదేశం తో దేవతలంతా లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం తీర్థయాత్రలు చేయసాగారు.
విష్ణుమూర్తి కూడా వామనవతారం లో వారితోపాటే తీర్థ యాత్రలకు యేతెంచాడు. వారు వివిధ ప్రదేశాలను తిరిగే సమయం లో ఒక ఎండిపోయిన చెట్టు తొర్రలో ఒక ముసలి రామ చిలుక కనిపించింది. దేవేంద్రుడు ఆ చిలుకను చూసి ‘ఓ చిలుకా ఈ చెట్టు ఎండిపోయి ఉంది.
దీనికి ఒక్క పండు కూడా లేదు. నీకు తిండి దొరకని ఈ ప్రదేశం లో మూసలి దానివై ఉండి ఎలా నివసిస్తున్నావు? మరో ఫలవంతమైన చెట్టుని ఆశ్రయించ వచ్చుకదా?’ అని అడిగాడు. అప్పుడు ఆ చిలుక ఇలా సమాధానమిచ్చింది.








Super Gratitude and good meaning