
ఇక పై రోజూ పంచాంగం కోసం మన AstroTags అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.
వీటితో పాటు మీ జన్మ వివరాలు బట్టి రోజూ మీరు ఏ పని చేయాలో ఏ పని చెయ్యకూడదో తెలుసుకోండి.
మరిన్ని వివరలకు ఈ లింక్ ను క్లిక్ చెయ్యండి https://play.google.com/store/apps/details?id=com.bytesedge.astrotags
Gopadma Vratam in Telugu
2. ఎలా ఆచరించాలి?
పల్లెల్లో నివసించేవారు, పశువులు ఉన్నవారు పశువులపాకలో దీనిని చెయ్యాలి, లేదా ఇంట్లోని పూజగదిని శుభ్రపరచి బియ్యపు పిండితో 33 పద్మములను చిత్రీకరించి దానిప్రక్కన ఒకపీఠంపై నారాయణుడు లేదా శ్రీకృష్ణుడి విగ్రహంకానీ ఉంచి షోడశోపచారాలతో పూజచెయ్యాలి. వ్రతము పూర్తయ్యాక ముప్పైమూడుమంది ముత్తెదువులకు శక్తిమేరకు వాయనములు, తాంబూలములు ఈయ వలెను. ఈ ప్రతాచరణలో తేనె, పొట్లకాయ, చెరకు, రేగుపళ్ళ గుమ్మడికాయ, కొత్తఉసిరిక, చింతపండు విసర్జించాలి.
చాతుర్మాస్య గోపద్మ వ్రతంలో ముత్త్తెదువలు తొలి ఏకాదశి నుంచి ప్రతిరోజు కొన్ని చొప్పున 1100 వత్తులు, 11 వందల ముగ్గులు పెట్టుకుంటారు. అయిదేళ్ళు నోముకున్నాక కన్నెముత్తైదువకు పసుపు, కుంకుమ, గాజులు, బట్టలు, భోజనం, బియ్యం, నువ్వుపిండి పెట్టి నమస్కరిస్తారు. గణపతికి ఉండ్రాళ్ళు నివేదన చేస్తారు. దూర్వాలతో గౌరమ్మను పూజించి, తులసికోటవద్ద దీపం వెలిగిస్తారు. జామపండ్లు, సీతాఫలాలు, చెరకు, ఖర్జూర పండ్లు వంటివాటితో కన్నె పిల్లల ఒడినింపి, గౌరమ్మకు నమస్కరిస్తారు. పరోపకారం, సేవాభావం, పరులను గౌరవించడం, చాతుర్మాస్య నియమాలు పాటించడం- మానవాళికి ఎంతో శుభం, ఆనందం చేకూరుస్తాయని అందరి నమ్మకం.
Gud …..information ..collected