తిధులను ఎలా విభజన ఇస్తారు? తిధులు ఎన్ని రకాలు? వాటి ఫలితాలు ఏమిటి!Good Thithulu

0
3156
What is Tithi How to Calculate Tithi How to Divide Thithulu
What is Tithi? How to Calculate Tithi? How to Divide Thithulu? in Telugu

What is Tithi? How to Calculate Tithi? How to Divide Thithulu?

2తెలుగు తిధులు రకాలు (Types of Telugu Tidhulu)

నంద తిధులు:-

పాడ్యమి, షష్ఠి, ఏకాదశి తిధులను నంధ తిధులు అని అంటారు. నంధ తిధులు మనషికి ఆనందాన్ని కలిగిస్తాయి. శిల్పం, యజ్ఞ యాగాది కర్మలకు, వివాహానికి, ప్రయాణానికి, కొత్త వస్త్రాభరణములకు, వైద్యం, మంత్ర విద్యలు నేర్చుకొనుటకు నంధ తిధులు ఉపయోగపడతాయి.

భద్ర తిధులు:-

విదియ, సప్తమి, ద్వాదశి తిధులను భద్ర తిధులు అని అంటారు. ఆత్మ రక్షణ కలిగిస్తాయి, వాస్తు కర్మలకు, యాత్రలకు, ఉపనయనమునకు, పూజలకు, విధ్యాబ్యాసమునకు, వాహనముల ఎక్కడం , సంగీతం, ఆహార సేకరణకు భద్ర తిధులు మంచివి అని అంటారు.

జయ తిధులు:-

తదియ, అష్టమి, త్రయోదశి తిధులను జయ తిధులు అని అంటారు. జయాన్ని కలిగిస్తాయి. వివాహం, గృహప్రవేశం, విగ్రహ ప్రతిష్ఠలు, యుద్దం, ఆయుధ దారణం, అధికారులను కలవటం, విద్యార్హత పరీక్షలు వీటికి జయ తిధులు మంచివి అని అంటారు .

రిక్త తిధులు:-

చవితి, నవమి, చతుర్ధశి తిధులను రిక్త తిధులు అని అంటారు. మంచి ఫలితాన్ని ఇవ్వలేవు. అగ్నిసంబంధ కర్మలకు, అసత్య భాషణకు, విరోదాలకు, హాని కలిగించే విషయాలకు, పాప కార్యాలకు రిక్త తిధులు మంచివి అని అంటారు .

మరిన్ని తిధుల గురుంచి తరువాతి పేజీలోకి వెళ్ళండి.