మార్గశిర మాసంలో లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం | Margashira Lakshmiwara Vratam

0
14427
Method of Margashira Lakshmiwara Vrata
What the Procedure & Rules of Margashira Lakshmiwara Vrata?!

What to Do For the Grace of Goddess Lakshmi in the Month of Margasira?

2మార్గశిర లక్ష్మీవార వ్రత విధానం (Method of Margashira Lakshmiwara Vrata Vidh):

ఈ మాసంలో వచ్చే లక్ష్మీ వారం నాడు స్త్రీలు తెల్లవారుఝామునే లేచి శుచిగా స్నానం చేసి దేవుడి గదిని అలికి ముగ్గులు పెట్టుకోవాలి. మహాలక్ష్మిని షోడశోపచారాలతో పూజించి నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి. కథ చెప్పుకుని పెద్దల ఆశీర్వాదం పొందాలి. 

  • మొదటి లక్ష్మీవారం నాడు పులగం, 
  • రెండవ వారం పరమాన్నం, 
  • మూడవ వారం అట్లు, 
  • నాలుగవ వారం గారెలు నివేదన చేయాలి. 

వారి వంశాచారాన్ననుసరించి కొన్ని మార్పులు ఉండవచ్చు. పుష్యమాసం వచ్చాక మొదటి లక్ష్మీవారం పూర్ణం బూరెలు, పులిహోర లక్ష్మీదేవికి సమర్పించాలి. ఆ వారంతో వ్రతం పూర్తవుతుంది. పుష్యమాసంలో మొదటి వారం కుదరకపోతే ఏదో ఒక వారం చేసుకోవచ్చు.