
3. ఆసనం వేయు పద్దతి
- ఉదరం, ఛాతీ భాగం నేలను తాకే విధంగా భూమిపై పడుకోవాలి.
నుదటి భాగం నేలను తాకేటట్టు ఉండాలి. - భుజాలు, పాదాలు వాటి వాటి స్థానాల్లో ఉండేలా చూచుకోవాలి.
భుజాలను ముందుకు చాచాలి. - భుజాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
- అరచేతులు కిందకు పెట్టాలి.
చేతి వేళ్ళ మధ్య యడము ఉండరాదు. ఒకదానికొకటి దగ్గరగా చేర్చాలి. - నేలపై ఆనించిన నుదటి భాగాన్ని రెండు భుజాలకు మధ్యన ఉండేలా చూసుకోవాలి.
- గాలి పీల్చుకుంటూ కాళ్ళు, మెడ, భుజాలు, తల భాగాలను మెల్లగా లేపాలి.
- మోచేతులు, మోకాళ్ళు ఎటువంటి పరిస్థితులలో వంచరాదు.
ఆసన సమయంలో జర్కులు ఉండరాదు. - పై భుజాలు ఖచ్చితంగా చెవులను తాకుతూ ఉండాలి.
పాదాలు ఒకదానికొకటి తాకుతూ ఉండాలి.
తలను వీలైనంతగా పైకి లేపాలి. - లేపిన పైభుజాల మధ్య తల ఉండేలా చూసుకోవాలి.
వీలైనంత బాగా వెనక్కు వంగాలి.శరీరం వంచిన విల్లు తరహాలో ఉండాలి.వంపు అనేది కాలి బ్రొటన వేలు నుంచి చేతి వేళ్ళ వరకు ఉండాలి. - కాలి బ్రొటన వేలు, చేతి వేళ్ళు పరస్పరం సమాంతరంగా అదేస్థాయి ఉండేలా చూసుకోవాలి.
- కింది ఉదరభాగంపై శరీరబరువు సమతుల్యం అయ్యేలా చూసుకోవాలి.
- పొత్తి కడుపు కింది భాగం మాత్రమే నేలను తాకి ఉండేలా చూసుకోవాలి.మిగిలిన భాగాలు కదలిక ఉండరాదు.
- కనీసం 10 సెకనులపాటు శ్వాస బిగపట్టి ఉంచాలి.
- మెల్లగా గాలి వదులుతూ ప్రారంభదశకు చేరుకోవాలి.
- శవాసన దశకు చేరుకుని విశ్రాంతి తీసుకోవాలి.
Promoted Content