
Facing Direction of God Idol in Home
1. లక్ష్మీ దేవి ఎక్కడ నిలిచి ఉంటుంది?
పరిశుభ్రంగా ఉన్న ఇంటిలో, ముగ్గుతో కళకళ లాడుతున్న ముంగిలిలో,పసుపు రాసిన గడపలో,పెద్దలను , గురువులను గౌరవించేవారి ఇంటా,అతిథులను ఆదరించేచోటా లక్ష్మీ దేవి ఉంటుంది. యత్ర నార్యస్తు పూజ్యన్తే రమన్తే తత్ర దేవతా ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు సంతోషంగా నిలిచి ఉంటారు. ఏ ఇంట్లో అయితే ప్రాతస్సంధ్యలలో దీపాన్ని వెలిగిస్తారో, ఏ ఇంట్లో అయితే సూర్యోదయానికి ముందే ఇంటిల్లిపాదీ నిద్రలేచి శుచిగా ఉంటారో, ఏ ఇంట్లో సాయం సంధ్యలలో నిద్రపోకుండా ఉంటారో అటువంటి ఇంట్లోకి లక్ష్మీ దేవి ప్రవేశిస్తుంది.
లక్ష్మీ దేవికి చంచల అన్న పేరు కూడా ఉంది. అంటే ఆమె ఎక్కడా స్థిరంగా ఉండదు అని అర్థం. కానీ ప్రతి ఇంటిలోనూ ఉండే కొన్ని వస్తువులలో ఆమె నిలిచి ఉంటుంది. ఆ వస్తువులకు తగిన విలువ ఇవ్వడం ద్వారా ఆమె సంతుష్టి చెంది ఆ ఇంట్లో నివాసం ఏర్పరుచుకుంటుంది.
లక్ష్మీ దేవి నిలిచి ఉండే వస్తువులు
లక్ష్మీదేవి ముగ్గులోనూ, పసుపు లోనూ,పూలూ పళ్లూ, గవ్వలూ, శ్రీ ఫలం అని పిలువబడే చిన్న కొబ్బరి కాయ లోనూ, దక్షిణావృత శంఖం లోనూ, గోమతీ చక్రాలలోనూ, మంగళ ద్రవ్యాలలోనూ నిలిచి ఉంటుంది. శ్రీ యంత్రం లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన లక్ష్మీ దేవి విగ్రహాలను పూజించడం వలన విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది.
లక్ష్మీ విగ్రహం ఎలాఉంటే విశేష ధనలాభాలు కలుగుతాయి?
పాదరసం తో చేసిన లక్ష్మీ దేవి విగ్రహాన్ని పూజించడం వలన విశేష ధనలాభాలు కలుగుతాయి. పాదరసం తో చేసిన విగ్రహం అందుబాటులో లేనప్పుడు వెండితో చేసిన లక్షీ దేవి విగ్రహాన్ని పూజించాలి. ఇంట్లో కుబేర ప్రతిమ ఉండటం వల్ల కూడా ధనం ఆకర్షించబడుతుంది.
Related Posts
లక్ష్మీదేవి అనుగ్రహానికి | How to Get Lakshmi Devi Blessings in Telugu
Hi
సూపర్
Excellent…
Excellent… సూపర్