Five Minutes To DeStress / ఆఫీసు ఒత్తిడిని అయిదు నిముషాలలో జయించండిలా
Five Minutes To DeStress – ఆఫీసు పనిలో ఉన్నప్పుడు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అధికమైన పనిగంటలు, క్లిష్టమైన లక్ష్యాలు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల పనిచేసే చోట ఎంతో ఒత్తిడికి గురౌతూ ఉంటారు. అటువంటప్పుడు ఒక అయిదు నిమిషాలు మీకోసం కేటాయించుకుని ఒత్తిడిని దూరం చేసుకోవడం వల్ల సమర్థవంతంగా పనిచేస్తారు.
- శరీరాన్ని స్ట్రెచ్ చేయండి. మెడ,భుజాలు, మణికట్టు, చేతివేళ్లు, ముఖ్యంగా వెన్నుపూస తొడ కండరాలు, చీలమండలు స్ట్రెచ్ చేయండి.
- గది బయటకు ఒకసారి దృష్టిని మరల్చండి.
- దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంటూ వదులుతూ శ్వాసను ఒక నిముషం పాటు గమనించండి.
- కాసేపు ఏమీ ఆలోచించకుండా ధ్యానం చేయండి.
- మీ డెస్క్ ని నచ్చినవిధంగా సర్దండి. సరైన వెలుతురు ఉండేలా చూడండి.
- ఒక కాగితంపై మీకు నచ్చిన బొమ్మను వేయండి. మంచి పాటను వినండి.
ఇలా చేయడం వల్ల పని ఒత్తిడి 5 నిమిషాలలో తగ్గి కొత్త ఉత్సాహంతో సమర్థవంతంగా పనిచేయగలుగుతారు.