
Engilipula Bathukamma
2ఎంగిలి పూల బతుకమ్మను ఎలా తయారు చేస్తారు? (How to Make Engilipula Bathukamma?)
1. బతుకమ్మను పేర్చడానికి సేకరించిన పూలను వాటి కాడలను చేతులతో గాని, కత్తితో కోసిన మరియు నోటితో కొరికిన ఆ పూలు ఎంగిలి అయినట్లుగా భావిస్తారు. పూర్వం కొందరు మహిళలు బతుకమ్మను పేర్చడానికి పూలను నోటితో కొరికి బతుకమ్మ పేర్చడం వలన అప్పటి నుంచి పెత్రమాస రోజు ఆడే బతుకమ్మకు ఎంగిలిపూల బతుకమ్మ అనే పేరు వచ్చినట్లు మన పురాణాలు చెబుతున్నాయి.
2. మొదటి రోజు బతుకమ్మను పేర్చడానికి ఒక రోజు ముందుగానే పువ్వులు తీసుకొని వస్తారు. ముందు రోజు తెచ్చిన ఆ పూలతో బతుకమ్మను పేర్చడం వలన ఎంగిలిపూల బతుకమ్మ అనే పేరు వచ్చినట్లు ప్రతీతి. కొన్ని ప్రాంతాల్లో భోజనం తిన్న తరువాత బతుకమ్మను పేరుస్తారని అందుకే ఆ పేరు వచ్చిందని కూడా చెబుతున్నారు.
మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.