
Have you heard about Vinayaki?
1గణేశుడి మహిళా రూపం
- ఆంజనేయునిలాగానే, వినాయకుడు కూడా ఘోటక బ్రహ్మచారి అనే నమ్మకం ఉంది.
- కొన్ని సందర్భాలలో ఆయనకు ధర్మపత్నిగా వేర్వేరు దేవతల పేర్లు వినిపిస్తాయి.
- ఉత్తరాదిలో సిద్ధి, బుద్ధి దేవతలు వినాయకుని ధర్మపత్నులు.
- వృద్ధి, లక్ష్మి, సరస్వతీ వంటి దేవతలు కూడా వినాయకునికి తోడుగా కనిపిస్తారు.
- అరుదుగా వినాయకి అనే సహచరి పేరు కూడా వినిపిస్తుంది.
వేల ఏళ్ల క్రిందటే!
- గణేశుని స్త్రీ రూపం వినాయకి ప్రతిమలు వేల సంవత్సరాల నుంచే ప్రాచుర్యంలో ఉన్నాయి.
- రాజస్థాన్‌లో లభించిన క్రీస్తుపూర్వం నాటి వినాయకి టెర్రకోట ప్రతిమ ఉదాహరణ.
- ప్రత్యేక ఆలయాలు లేనప్పటికీ సుచీంద్రం, చెరియనాడ్ వంటి ఆలయాలలో వినాయకి శిల్పాలు ఉన్నాయి.
పురాణాలలో ప్రస్తావన
- జనబాహుళ్యంలో పెద్దగా ప్రచారం లేకపోయినా, పురాణాలలో వినాయకి ప్రస్తావన ఉంది.
- స్కంద ,మత్స్య, వాయు, లింగ పురాణాలలో వినాయకి గురించి కబుర్లు ఉన్నాయి.
- కొన్ని కథల ప్రకారం వినాయకి తొమ్మిదిమంది మాతృకలలో ఒకరు, మరికొన్ని కథల ప్రకారం 64 మంది యోగినిలలో ఒకరు.
- అంధకాసురుని వధ నేపథ్యంలో వినాయకి ప్రస్తావన అత్యంత ఆసక్తికరమైనది.
అంధకాసురుని వధ
- పరమేశ్వరుడు అంధకాసురుని వధించడానికి బయల్దేరాడు.
- అంధకాసురుని రక్తం నేల మీద పడగానే, ప్రతి రక్తపు బొట్టు నుంచి మరొక అంధకాసురుడు ఉద్భవిస్తాడు.
- అలా అంధకాసురుని రక్తం నేల మీద పడకుండా చూడటానికి ప్రతి దేవతా నుంచీ స్త్రీ స్వరూపాలు వెలికివచ్చాయి.
- వినాయకుని నుంచి వెలికి వచ్చిన స్త్రీ తత్వమే వినాయకి.
- వినాయకి కి గజానని, గణేశని, విఘ్నేశ్వరి వంటి పేర్లు ఉన్నాయి.
- చాలా సందర్భాలలో వినాయకునితో సంబంధం చెప్పనప్పటికీ, ఆమె రూపం అచ్చు వినాయకునిలాగా ఉంటుంది.
- పరశు, గొడ్డలి, మోదకాలను ధరించిన వినాయకి రూపం ప్రాచీన శిల్పాలలో కనిపిస్తుంది.
- స్త్రీ దేవతలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చే తాంత్రిక ఆచారాలలో వినాయకి ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంది.
Related Posts
vinayakudu | వినాయకుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే!
Sri Siddhi Vinayaka Stotram in Telugu | శ్రీ సిద్ధివినాయక స్తోత్రం