
What is Ekadashi?
3ఏకాదశి ఉపవాస విధి విధానాలు (Ekadashi Fasting Rules & Procedures):
1. ఏకాదశి వ్రతం చేయాలి అనుకున్న వారు ఒక రోజు ముందుగానే దశమి రోజునుంచే తప్పని సరిగా కొన్ని నియమాలు పాటించాలి.
2. దశమి నాడు మాంసం, ఉల్లిపాయలు, మసూరి పప్పు మొదలైన పదార్థాలు తినకూడదు.
3. దశమి నాడు రాత్రిపూట బ్రహ్మచర్యం పాటించాలి.
4. ఏకాదశి రోజు ఉదయం బ్రష్ చేయకుండా నిమ్మ, జామ లేక మామిడి ఆకులు నోట్లో వేసుకుని నమలి నీటితో పుక్కలించాలి.
5. తరువాత స్నానం ఆచరించి ఆలయానికి వెళ్ళి ఓం నమో భగవతే వాసుదేవాయ ” ఈ ద్వాదశ మంత్రాన్ని జపించాలి.
6. విష్ణుమూర్తి సహస్రనామాలు జపిస్తూ విష్ణు భగవానుని ప్రార్థించండి.
7. ఈ రోజు ఇంట్లో చీపురుతో ఊడ్చకూడదు.
8. చిన్న ప్రాణి కూడా హాని కలుగ చేయకూడదు.
9. ఈ రోజున వెంట్రుకలు, గోళ్లు కత్తిరించుకోకూడదు.
10. ఈ వ్రతం రోజున వీలైనంత వరకు దాన, ధర్మాలు చేయాలి.
11.ఫలాహారం క్యారెట్, గోబీ మరియు ఆకుకూరలు వాడకూడదు.
12. భగవంతునికి సమర్పించిన ఆ తర్వాత తెలికైన పండ్లు ఆహారంగా తీసుకోవాలి.
13. ఆహారానికి ముందు తులసి దళం తేసుకోవాలి.
14. ఈ రోజున బ్రాహ్మణులకు తీపి పదార్థాలు మరియు దక్షిణ ఇవ్వాలి.
15. ఆ రోజంత విష్ణు సహస్ర నామాలు జపించాలి.
మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.