
Dwija Ganapathy
1. ద్విజగణపతిని పూజించడం వల్ల కలిగే శుభాలు
ద్విజ గణపతిని పూజించడం వలన అప్పులు తొలగిపోతాయి. ఆ కుటుంబం లో సుఖ శాంతులు వెల్లి విరుస్తాయి. విద్యా బుద్ధులు కలుగుతాయి. ఉద్యోగం విషయాలలో, వివాహ విషయాలలో కలిగే ఇబ్బందులు తొలగుతాయి.
ద్విజగణపతి ఎవరు? ఆయన రూపం ఎటువంటిది?
వినాయకుని 32 రూపాలలో ఆరవది ద్విజగణపతి రూపం. ద్విజ అంటే రెండుసార్లు జన్మించిన వాడని అర్థం. బ్రాహ్మణులలోనూ, ఇతర కులాలలోనూ యజ్ఞోపవీత ధారణ అనే ఆచారం ఉంటుంది. అందుకోసం ఉపనయనం అనే కార్యక్రమాన్ని చేస్తారు. ఉపనయనం అంటే రెండవసారి జన్మించడం తో సమానం అంటారు పెద్దలు. అందుకని ఆయనను ద్విజ గణపతి అన్నారు.
ద్విజగణపతి రూపం పూర్ణ చంద్రబింబం లా ధవళకాంతులు విరజిమ్ముతూ ఉంటుంది. నాలుగు శిరసులతో స్వామి బ్రహ్మదేవుని తలపిస్తాడు. కమండలాన్నీ, జపమాలనూ, దండాన్నీ, పుస్తకాన్నీ ధరించి ఉంటాడు.
ద్విజ గణపతిని ఎలా పూజించాలి ?
యం పుస్తకాక్ష గుణదండ కమండలు
శ్రీః విద్యోతమాన కరభూషణ మిందువర్ణమ్
స్తంబేరమానవ చతుష్టయ శోభమానం
త్వాం ద్విజగణపతే ! సిద్ధ్విజ గణాధిపతే స ధన్యః ||
అనే ఈ శ్లోకాన్ని ధ్యానించడం ద్వారా ద్విజగణపతి అనుగ్రహాన్ని పొందవచ్చు.
Related Posts
Swetharkamoola Ganapathi Temple | స్వయంభూవుగా ఉద్భవించిన శ్వేతార్క మూలగణపతి
అనుకున్న పనులన్నీ మధ్యలోనే ఆగిపోతున్నాయా ? మీకోసమే ఈ పరిష్కారం! | Taruna Ganapathi Ghyana in Telugu
వాస్తు దోషాలను, నర దృష్టిని నివారించే శుభ దృష్టి గణపతి | Shuba drishti ganapathi
దిష్టి తగలకుండా ఉండాలంటే మీ ఇంట్లో గణపతిని ఇలా పెట్టుకోండి.| Shubha Drishti Ganapathi
Sri Maha Ganapathi Chaturavrutti Tarpanam in Telugu | శ్రీ మహాగణపతి చతురావృత్తి తర్పణం
Gud information….rajitha shivalingam nu intlo puja Lu cheyocha