Shani Dev | సంక్రాంతి రోజున ఈ విధంగా చేస్తే, శని వదలిపోతుంది.

0
63
Do this on Sankranti to ease Shani's effects
Do this on Sankranti to calm Shani

 

Do this on Sankranti to reduce Shani’s impact

1సంక్రాంతి రోజున ఈ విధంగా చేస్తే, శని వదలిపోతుంది…

సూర్యుడు సంక్రాంతి రోజున మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నవారు సంక్రాంతి సందర్భంగా ఇలా చేస్తే ఆ శని ప్రభావం తగ్గుతుందంటున్నారు పండితులు.

మకర సంక్రాంతి:

  • ప్రతీ నెల రోజులకు ఒక్కో రాశిలో సంచరించే సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి అడుగుపెట్టినప్పుడు జరుపుకునే పండుగే మకర సంక్రాంతి.
  • మకర రాశికి అధిపతి శని. శని ఎవరో కాదు సాక్షాత్తూ ఆ సూర్య భగవానుడి కుమారుడు. అందుకే సంక్రాంతి రోజు కొన్ని నియమాలు పాటించడం ద్వారా జాతకంలో శని ప్రభావం తగ్గుతుందంటారు.

శని ప్రభావం మసకబారే సమయం:

  • సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపు తన దిశ మార్చుకున్నప్పుడు, తన కుమారుడైన శనితో కలసి దాదాపు నెలరోజులు ఉంటాడని పండితులు చెబుతారు.
  • ఆ నెల రోజులు సూర్యుడి తేజస్సు మందు, శని తేజస్సు మసకబారుతుంది. అంటే శని ప్రభావం తగ్గుతుంది.

నువ్వులు ప్రత్యేకం:

  • పురాణాల్లో చెప్పిన విషయాల ప్రకారం సంక్రాంతి రోజున తన ఇంటికి వచ్చిన తండ్రి సూర్య భగవానుడికి శని తనకు ఇష్టమైన నల్ల నువ్వులతో స్వాగతం పలుకుతాడు.
  • సంతోషించిన సూర్యుడు ఈ రోజు ఎవరైతే తనకు నల్ల నువ్వులు సమర్పిస్తారో వారికి శని బాదలు తొలగి సుఖ సంతోషాలతో, ఐశ్వర్యంతో వర్థిల్లుతారని చెప్పాడట. అందుకే ఏటా మకర సంక్రాంతి రోజు సూర్యుడి పూజలో నల్ల నువ్వులు ఉపయోగిస్తారని చెబుతారు.
  • సూర్యుడికి, శనికి ప్రీతికరమైన నల్ల నువ్వులను సంక్రాంతి రోజు ధారపోసినా, దానమిచినా, శని బాధల నుంచి ఉపశమనం లభించి వారి జీవితంలో వెలుగులు ప్రసరిస్తాయని చెబుతారు.

దానం మరియు పూజ:

  • మకర సంక్రాంతి రోజు చేసే దానం, పూజకు రెట్టింపు ఫలితం ఉంటుందని చెబుతారు. అందుకే సంక్రాంతి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి నల్లనువ్వులు కలిపిన నీటిని సమర్పించాలి.
  • ఆ తర్వాత శనిని తలుచుకుని నువ్వులు సూర్యుడికి సమర్పించాలి. పూజ పూర్తైన తర్వాత ఆవనూనె, నల్ల నువ్వులు, నువ్వుల లడ్డూ ఎవరికైనా దానం ఇచ్చినా, శని బాధలనుంచి విముక్తి లభిస్తుంది.

శని ప్రభావం:

శని 12, 1, 2 స్థానాల్లో సంచారిస్తే ఏలినాటి శని అంటారు. జన్మరాశికి 4, 8, 10 స్థానాల్లో శని సంచరిస్తున్న శనిని అర్ధాష్టమ, అష్టమ, దశమ శని అంటారు. ఇవి కూడా దోషమే.

ఏలినాటి శని:

  • శని 12వ స్థానంలో సంచరించేటప్పుడు వ్యాపారాల్లో ఒడిదుడుకులు, అనారోగ్యం, మందుల వాడకం, తరచూ ప్రయాణాలు ఉంటాయి.
  • జన్మరాశిలో అంటే శని ఒకటో స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఆరోగ్యభంగం, నిందలు, మనశ్శాంతి లోపించడం, ధన వ్యయం, రుణబాధలు ఉంటాయి.
  • శని రెండవ రాశిలో సంచరిస్తున్నప్పుడు అన్ని పనులు పూర్తవుతున్నట్టే అనిపిస్తాయి కానీ ఏదీ పూర్తికాదు. ఇంకా అప్పుల బాధలు, అనారోగ్యం, మానసిక ఆందోళన ఉంటుంది.

అర్ధాష్టమ శని:

  • జన్మరాశి నుంచి నాలుగవ రాశిలో శని సంచరిస్తే అర్ధాష్టమ శని అంటారు.
  • ఈ సమయంలో రాజకీయ, వ్యాపారాల్లో చిక్కులు, కుటుంబ సమస్యలు, ఆకస్మిక బదిలీలు ఉంటాయి. వాహన ప్రమాదాలు, తల్లికి అనారోగ్యం ఉంటాయి.

అష్టమ శని:

  • జన్మరాశి నుంచి 8వ స్థానంలో శని సంచరించడాన్ని అష్టమ శని అంటారు.
  • ఈ కాలంలో ఉద్యోగాల్లో ఆటంకాలు, వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఆలోచనలు స్థిరంగా లేకపోవడం, అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. శత్రువుల బాధలు, ఊహించని నష్టాలు వస్తాయి.

దశమ శని:

  • జన్మరాశి నుంచి 10వ స్థానంలో శని సంచరిస్తున్నప్పుడు కంటక శని అంటారు.
  • దీనివలన కోర్టు కేసులు, సాంఘిక, రాజకీయ విభేదాలు, ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి.
  • ఈ దోషాల నుంచి విముక్తి పొందడానికి సంక్రాంతి రోజు నువ్వులను సూర్యుడికి సమర్పించడం, దానం, పూజ చేయడం ముఖ్యంగా చెప్పబడింది.

 

ఇలాంటి మరెన్నో విషయాలు మరియు మన సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవటానికి, హరిఓం పోస్టులు మీకు వ్యక్తిగతంగా కావాలంటే ఇప్పుడే 9059-777-789 కి “హరిఓం” అని మెసేజ్ చేయండి.

Related Posts

Hanuman & Shani Dev | హనుమంతుడికి శనిదేవుడు ఏమని మాట ఇచ్చాడు?

Shani Dev Secrets | శనిదేవుడి ఈ ఐదు రహస్యాల గురించి తెలుసుకోండి.

Shani Dosham | మీకు శని దోషం ఉందని తెలుసుకోవడం ఎలా? మరియు శని దోష పరిష్కారాలు

Shani Effect 2024 | శనీదేవుడి ఆధీనంలో రాశిచక్రం. ఈ రాశుల వారికి అన్ని శుభ దినములే.

Shani Effect 2024 | శని దేవుడు ఈ రాశుల వారిపై ఆగ్రహం, వీరికి అన్ని కష్టాలే.