గణపతి యొక్క 32 రూపాల్లో మొదటి 16 రూపాలకు ఉన్న ప్రాముఖ్యత, విశిష్ఠత & పఠించాల్సిన స్తోత్రాలు ఏమిటి?! | Different Forms of Lord Ganapati

0
2345
Lord Ganapathi in different forms
Different Forms of Lord Ganapati

What are the 32 Forms of Ganesha?

49. క్షిప్త గణపతి (Kshipra Ganapati) :

ఈ గణపతి రూపానికి 4 చేతులుంటాయి. కుడి వైపు చేతులలో దంతం మరియు రత్నాలు పొదిగిన బంగారు కుండ ఉంటుంది. ఎడమ వైపు చేతులతో కల్పవృక్షం తీగ మరియు అంకుశం ధరించి కనిపిస్తారు. ఆయన అనుగ్రహం కొసం కింద ఉన్న మంత్రాన్ని పారాయణం చేయండి.

దంత కల్పలతా పాశ రత్న కుంభాంకుశోజ్జ్వలమ్ బంధూక కమనీయాభం ధ్యాయేత్ క్షిప్ర గణాధిపమ్.

10. విఘ్న గణపతి (Vigna Ganapati) :

ఈ గణపతి కుడి వైపు చేతులలో శంఖం, విల్లు, గొడ్డలి, చక్రం, పూలగుత్తి మరియు ఎడమ వైపు ఉన్న చేతులతో చెరకు, పూలబాణం, పాశం, విరిగిన దంతం మరియు బాణాలు పట్టుకుని ఉంటారు. లక్షణమైన విఘ్న నాశనం ఈ రూపంలో కనిపిస్తుంది. ఆయన అనుగ్రహం కోసం కింద ఉన్న మంత్రాన్ని పారాయణం చేయండి.

శంఖేక్షు చాప కుసుమేషు కుఠార పాశ చక్ర స్వదంత సృణి మంజరికా శరౌఘై పాణిశ్రిఅఅఅ పరిసమీహిత భూషణా శ్రీ విఘ్నేశ్వరో విజయతే తపనీయ గౌరః

11. లక్ష్మీ గణపతి (Sri Lakshmi Ganapathi):

ఈ గణపతి రూపానికి 10 చేతులుంటాయి. కుడి వైపు చేతితో వరదముద్రనిస్తూ, కత్తి, చిలుక, మాణిక్యం పొదిగిన కుంభం, పాశం మరియు ఖడ్గం ధరించి ఉంటాడు. ఎడమ వైపు చేతులతో అభయ హస్త ముద్రతో దానిమ్మ, అంకుశం, కల్పలత మరియు అమృతం ధరించి దర్శనం ఇస్తారు. ఆయన అనుగ్రహం కొసం కింద ఉన్న మంత్రాన్ని పారాయణం చేయడం వలన మీకు ఐశ్వర్యం వరిస్తుంది.

బిభ్రాణ శ్శుకబీజపూరక మిలన్మాణిక్య కుంభాంకుశన్ పాశం కల్పలతాం చ ఖడ్గ విలసజ్జ్యోతి స్సుధా నిర్ఘరః శ్యామేనాత్తసరోరు హేణ సహితం దేవీద్వయం చాంతికే గౌరాంగో వరదాన హస్త సహితో లక్ష్మీ గణేశోశావ తాత్

12. హేరంబ గణపతి (Heramba Ganapathi):

ఈ గణపతి రూపానికి 10 చేతులుంటాయి. కుడి వైపు చేతితో అభయముద్రనిస్తూ, కత్తి, అక్షమాల, గొడ్డలి మరియు మోదకం ధరిస్తారు. అలాగే ఎడమ వైపు ఉన్న చేతులతో వరద హస్త ముద్రతో విరిగిన దంతం, అంకుశం, ముద్గరం, పాశం ధరించి దర్శనం ఇస్తారు. కింద ఉన్న మంత్రాన్ని పారాయణం చేయడం వలన మీ ప్రయాణాలలో ఆపదలు తొలగిపోతాయి.

అభయ వరదహస్త పాశదంతాక్షమాల సృణి పరశు రధానో ముద్గరం మోదకాపీ ఫలమధిగత సింహ పంచమాతంగా వక్త్రం గణపతి రతిగౌరః పాతు హేరంబ

మరిన్ని రూపాల కోసం తరువాతి పేజీలో చూడండి.