
What are the 32 Forms of Ganesha?
35. ద్విజ గణపతి (Dwija Ganapati):
ఈ గణపతి రూపానికి కూడా 4 చేతులుంటాయి. కుడి చేతులతో పుస్తకం మరియు దండం ఉంటాయి. ఎడమవైపు చేతులలో అక్షమాల మరియు కమండలం పట్టుకుని ఉంటాడు. కింద ఉన్న మంత్రాన్ని పారాయనం చేస్తూ పూజ చేయడం వలన భక్తులకు గొప్ప తెలివి తేటలను వరంగా ఇస్తాడు.
యం పుస్తకాక్ష గుణదండ కమండలు శ్రీః విద్యోతమాన కరభూషణ మిందువర్ణమ్ స్తంబేరమానవ చతుష్టయ శోభమానం త్వాం ద్విజగణపతే ! సిద్ధ్విజ గణాధిపతే స ధన్యః
6. శక్తి గణపతి (Shakti Ganapathi):
ఈ గణపతి రూపానికి 4 చేతులుంటాయి. ఈ గణపతి అంకుశం మరియు పాశం పట్టుకుని దర్శనమిస్తారు. కింద ఉన్న మంత్రాన్ని పారాయణం వలన భక్తులకు దేనినైన సాధించగలమనే ఆత్మ ధైర్యాన్ని ప్రసాదిస్తాడు.
ఆలింగ్య దేవీం హరితాంగయష్టిం పరస్పరా శ్లిష్ట కటిప్రదేశమ్ సంధ్యారుణం పాశ స్ఫటీర్దధానం భయాపహం శక్తి గణేశ మీదే.
7. ఉచ్ఛిష్ట గణపతి (Ucchista Ganapati) :
ఈ గణపతి రూపానికి 4 చేతులుంటాయి. కుడివైపు చేతులతో నల్ల కలువ, వరివెన్ను మరియు ఎడమ చేతులతో దానిమ్మ పండు, జపమాల పట్టుకుని కనిపిస్తారు ఈ గణపతి. కింద ఉన్న మంత్రాన్ని పారాయణం వలన భక్తులు కోరిన కోరికలు అన్ని తీరుస్తాడు ఈ గణపతి.
నీలబ్జ దాడిమీ వీణా శాలినీ గుంజాక్ష సూత్రకమ్ దధదుచ్ఛిష్ట నామాయం గణేశః పాతు మేచకః
8. సిద్ధి గణపతి (Siddi Ganapathi) :
ఈ గణపతి రూపానికి 4 చేతులుంటాయి. ఎడమవైపు చేతులతో పండిన మామిడి పండు మరియు కుడి వైపు చేతులతో పూలగుత్తి మరియు గొడ్డలి పట్టుకుని ఉంటాడు. కింద ఉన్న మంత్రాన్ని పారాయణం చేయడం వలన భక్తులు ప్రారంభించిన ఏ పనిలోనైనా అపజయమన్నది ఉండదు అని చెబుతున్నారు.
పక్వచుత ఫల పుష్పమంజరీ ఇక్షుదండ తిలమోదకై స్సహ ఉద్వహన్ పరశుమస్తు తే నమః శ్రీ సమృద్ధియుత హేమం పింగల
మరిన్ని రూపాల కోసం తరువాతి పేజీలో చూడండి.