గణపతి యొక్క 32 రూపాల్లో మొదటి 16 రూపాలకు ఉన్న ప్రాముఖ్యత, విశిష్ఠత & పఠించాల్సిన స్తోత్రాలు ఏమిటి?! | Different Forms of Lord Ganapati

0
2344
Lord Ganapathi in different forms
Different Forms of Lord Ganapati

What are the 32 Forms of Ganesha?

216 గణనాధుడి ముఖ్యమైన & అతి పవిత్రమైన రూపాలు (16 Most Important & Most Sacred Forms of Lord Ganesh)

1. తరుణ గణపతి (Sri Tharuna Ganapathi):

ఈ గణపతి రూపానికి 8 చేతులుంటాయి. కుడి వైపు చేతులతో పాశం, వెలగ గుజ్జు, దంతం మైయు చెరకు పట్టుకుని ఉంటాడు. ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, నేరేడు పండు మరియు వరివెన్ను పట్టుకుని దర్శనమిస్తారు గణపతి. ఏ రూపం ఉన్న గణపతిని కింద ఉన్న మంత్రాన్ని జపిస్తూ పూజ చేయాలి.

పాశాంకశాపూస కపిత్థ జంబూ స్వదంత శాలీనమపి స్వహస్త్రైః ధత్తే సదా య సతరుణాభః పాయాత్స యుష్మాం ష్తరుణో గణేశః

2. బాల గణపతి (Bala Ganapathi):

ఈ గణపతి రూపానికి 4 చేతులుంటాయి. కుడి వైపు చేతులలో అరటి పండ్లు మరియు పనసతొన పట్టుకుని ఉంటాడు. ఎడమవైపు వైపు ఉన్న చేతులతో మామిడిపండు మరియు చెరకుగడను పట్టుకుని దర్శనమిస్తారు. తెలివితేటలు మంచిగా ఉండాలి అంటే ఈ గణపతిని పూజించాలి. ఏ రూపం ఉన్న గణపతిని కింద ఉన్న మంత్రాన్ని ప్రతిరోజూ సూర్యోదయ సమయాన పారాయణం చేయాలి.

కరస్థ కదలీ చూత పన పేక్షుక మోదకమ్ బాలసూర్య నిభం వందే దేవం బాలగణాధిపమ్

3. వీర గణపతి (Veera Ganapati) :

ఈ గణపతి రూపానికి 16 చేతులుంటాయి. కుడి వైపు చేతులతో బాణం, బేతాలుడు, చక్రం, మంచపుకోడు, గద, పాము, శూలం మరియు గొడ్డలి బొమ్మ ఉన్న జెండాను పట్టుకుని ఉంటాడు. ఎడమ వైపు ఉన్న చేతులతో శక్తి అనే ఆయుధం, విల్లు, ఖడ్గం, ముద్గరమనే ఆయుధం, అంకుశం, పాశం, కుంతమనే ఆయుధం మరియు దంతం ధరించి కనిపిస్తారు. కింద ఉన్న మంత్రాన్ని పారాయణం చేసి పూజ చేయడం వలన భక్తులకు ఆయన మనోధైర్యాన్ని ప్రసాదిస్తాడు.

బేతాల శక్తి శర కార్ముక చక్ర ఖడ్గ ఖట్వాంగ ముద్గర గదాంకుశ నాగపాశాన్ శూలం చ కుంత పరశుధ్వజ మాత్తదంతం వీరం గణేశ మరుణం త్వనిశం స్మరామి.

4. భక్త గణపతి (Bhakta Ganapathi) :

ఈ గణపతి రూపానికి 4 చేతులుంటాయి. కుడి వైపు చేతులలో కొబ్బరికాయ, అరటిపండు పట్టుకుని ఉంటాడు. ఎడమ వైపు ఉన్న చేతులలో మామిడి పండు, బెల్లపు పరమాన్నం ఉన్న పాత్ర పట్టుకుని దర్శనమిస్తాడు. కింద ఉన్న మంత్రాన్ని పారాయణం వలన భక్తులకు భక్తి భావం బాగా పెరుగుతుంది.

నాలికేరామ్ర కదలీ గుడపాయాస ధారిణమ్ శరచ్చంద్రాభ్వవుషం భజే భక్త గణాధిపమ్.

మరిన్ని రూపాల కోసం తరువాతి పేజీలో చూడండి.