ప్రపంచంలోనే ఒకే ఒక్క యముడి ఆలయం!? Dharmapuri Yama Dharmaraja Temple

0
1775
Temple of lord Yama
Dharmapuri Yama Dharmaraja Temple History Timings & Significance

Yama Temple at Dharmapuri in Karimnagar District, Telangana

1ధర్మపురి శ్రీ యమధర్మరాజు ఆలయం

మనం సాధారణంగా ప్రతి చోట అందరి దేవుళ్ళకు చాలా చోట్ల చాలా దేవాలయాలు నిర్మిస్తారు. కానీ యమధర్మరాజుకు మాత్రం మన భారతదేశంలో ఒకే ఒక దేవాలయం ఉంది. అది ఏక్కడ ఉంది?, ఆ దేవాలయం గురించిన వివరాలు మనం ఇక్కడ తెలుసుకుందాం. మన ప్రాణాలు హరించే యముడికి ఆలయం ఇక్కడ విశిష్టత

మన దేశంలో ఒకే ఒక్క యముడి ఆలయం (Sri Yama Dharma Raja Temple History)

1. యమధర్మరాజు యొక్క ఆలయం కరీంనగర్ కి 70 కిలోమీటర్ల దూరంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఉన్నది.
2. ఈ ప్రదేశంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, యమధర్మరాజు, వెంకటేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి, ఆంజనేయ స్వామి, రామాలయం, రామలింగేశ్వర స్వామి మరియు సంతోషిమాత ఆలయాలు కూడా ఉన్నాయి.
3. ఈ పుణ్యక్షేత్రం వెయ్యేళ్ల చరిత్ర కలిగి ఉంది.
4. ఈ ఆలయంలో యమధర్మరాజును దర్శనం చేసుకున్నాకే నరసింహ స్వామి దర్శించుకోవడం ఆనవాయితీ.
5. ఈ ఆలయంలో పెద్ద పెద్ద కోరలతో, చేతులతో యమదండంతో భీకరంగా యమధర్మరాజు యొక్క విగ్రహం కనిపిస్తుంది.
6. ఈ ఆలయం దర్శిస్తే యమపురి ఉండదనే భక్తుల నమ్మకం.
7. ఈ ఆలయం చారిత్రకంగా కూడా బాగా ప్రసిద్ధి పొందింది.
8. ధర్మపురి ప్రాంతం వేదాలకూ, ప్రాచీన సంస్కృతికి మరియు సంగీత సాహిత్యాలకు పుట్టినిల్లు.
9. ఈ ఆలయంలో యమధర్మరాజును దర్శిస్తే మానసిక, శారీరక బాధల నుంచి విముక్తి కలిగి, ఆయురారోగ్య మరియు ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.

ధర్మపురిలో మాత్రమే యముడు దేవాలయం ఎందుకు వెలిసిందో తెలుసా? (Do You Know Why the Yama Temple Was Constructed in Dharmapuri Only?)

1. హిరణ్య కశిపుడిని సంహరించి ఉగ్రరూపంలో ఉన్న నరసింహుడు ప్రహ్లాదుడి యొక్క అర్చనతో శాంతించి యోగ రూపంలోకి మారి కొలువైన చోట ఈ ధర్మపురి అనే క్షేత్రం.
2. పాపాలు చేస్తే అందరూ నరకానికి పోతారు.
3. నరకంలో నిత్యం పాపుల మధ్య గడిపే యముడికి మనశ్శాంతి దూరమైంది.
4. అప్పుడు యముడు ఎన్నో యాత్రలు చేసుకుని చివరికి ధర్మపురి చేరుకున్నారు.
5. అక్కడ ఆ పుణ్య గోదావరిలో స్నానమాచరించి ఆ తర్వాత యోగ నరసింహుడిని దర్శించుకున్నారు యమధర్మరాజు.
6. ఆ దర్శనం తరువాత యముడికి అంతవరకు పాపాత్ములకు శిక్షలతో పట్టుకున్న దోషాలు తోలిగిపొయాయి.
7. అప్పుడు యముడికి మానసిక ప్రశాంతత దోరికిందని బ్రహ్మాండ, స్కంద పురాణాలు చెబుతున్నాయి.

ధర్మపురి ఆలయ సమయాలు (Dharmapuri Temple Timings)

ధర్మపురి ఆలయం ఉదయం 5:00 AM – 2:00 PM మరియు సాయంత్రం 4:00 PM – 8:00 PM వరకు తెరిచి ఉంటుంది.

Hindu Temples Guides Related Posts

శబరిమల ఆలయం చరిత్ర & విశిష్టత | Sabarimala Temple History & Significance

వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమయాలు & సేవలు | Vadapalli Sri Venkateswara Swamy Temple Timings & Seva Tickets

వాడపల్లి వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు | Vadapalli Sri Venkateswara Swamy Brahmotsavam Dates 2023

వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి ఎలా చేరుకోవాలి? | How to Reach Vadapalli Sri Venkateswara Swamy Temple?

వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం | Vadapalli Sri Venkateswara Swamy Temple History

పూరీ జగన్నాథ ఆలయానికి ఎలా చేరుకోవాలి? | How to Reach Puri Jagannath Temple & Visiting Places?

పూరీ జగన్నాథ ఆలయ దర్శన & పూజా సమయాలు | Puri Jagannath Temple Timings, Puja & Entry Fee

పూరీ జగన్నాథ ఆలయ చరిత్ర, రహస్యాలు & విశేషాలు | Shree Puri Jagannath Temple History & Secrets

మీకు ఏటువంటి సమస్య ఉన్న ఈ గుడిలో ముడుపు కడితే అన్ని తొలగిపోతాయి!? | Temple That Remove All Your Problems & Land Cases

సంతానం కలగట్లేదని బాధ పడుతున్నారా? ఈ ఆలయం సందర్శిస్తే చాలు!? | Powerful Temple for Pregnancy?