
4. లక్షణాలు:
డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి లాంటి మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిని సులభంగా గుర్తించవచ్చు. సాధారణంగా డిప్రెషన్ తో బాధపడే పిల్లల్లో ఈ క్రింది లక్షణాలు కనిపిస్తుంటాయి.
- ఒంటరితనాన్ని కోరుకుంటారు
- ఆటపాటల వల్ల ఆసక్తి కనబరచరు
- సంకుచితంగా తయారవుతారు.
- సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడుతారు,
- ఇతరులను నిరాధారంగా విమర్శిస్తుంటారు,
- రాత్రివేళల్లో ప్రక్క తడపడం సంభవిస్తుంది,
- నిద్రలో పీడకలలు వస్తుంటాయి,
- నిద్ర ఆహారాలలో తేడాలువస్తాయి,
- జ్ఞాపకశక్తి, ఏకాగ్రతలో లోపాలు తలెత్తుతాయి,
- ఏడతెగని, పనికిమాలిన, ఆలోచనలు ముసురుకుంటాయి,
- శరీరంలో శక్తి క్షీణించి, బరువు కోల్పోతారు,
- ప్రతి విషయానికి చిటపటలాడుతుంటారు,
- ఆత్మనూన్యత, అపరాధ భావం వ్యక్తం చేస్తుంటారు,
- చదువుపట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తుంటారు,
- ఆత్మహత్య భావం, ప్రయత్నాలు కనిపిస్తాయి.
పై జాబితాలో 4, 5 లక్షణాలు రెండువారాలకు పైగా కని. పిస్తుంటే ఆ వ్యక్తి డిప్రెషన్ తో బాధపడుతున్నట్టు భావించాల్సివస్తుంది. అలాంటి సందర్భములో తల్లిదండ్రులు మనసు విప్పి మాట్లాడితే కారణాలు, పరిస్థితులు అర్థమవుతాయి.
డిప్రెషన్ తో ఉన్నవారికి ఆత్మీయత, అనురాగం, ఆదరణ, భరోసా, నమ్మకం కల్గించడం ద్వారా వారిలో మార్పు తీసుకురావచ్చు. అందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, లెక్చరర్లకు అవగాహన, ఓర్పు, సహనం చాలా అవసరం. తమ ప్రయత్నాలు ఫలించినప్పుడు అనుభవంగల సైకాలజిస్టును సంప్రదించడం మంచిది. అలాగే కొన్ని సందర్భాలలో సైకాలజిస్ట్ ద్వారా వైద్యం చేయించడంవల్ల ఫలితం ఉంటుంది.
సాధారణంగా డిప్రెషన్ తో ఉన్న వారికి ఆత్మీయ స్పర్శ, అనురాగపు మాటలు దివ్య ఔషధంలా పనిచేస్తాయి. అయితే తీవ్రస్థాయిలో ఉన్నవారికి ‘యాంటీ డిప్రెసంట్స్’ సైకియా ట్రిస్టు పర్యవేక్షణలో వాడాల్సివుంటుంది.
అయితే చాలామంది తల్లిదండ్రులు పిల్లల్లో ప్రవర్తనాలోపాలు, మానసిక సమస్యలను సరిగ్గా అర్ధం చేసుకోరు. ఏదైనా సమస్య ఎదురైతే అదొక పిల్లచేష్టగా కొట్టి పడేస్తారు. చాలా సందర్భాలలో భయపెట్టి శిక్షించి దారికి తేవాలని చూస్తారు.
అలా చేయడంవల్ల పిల్లల్లో విపరీత ధోరణులు తలెత్తే అవకాశాలున్నాయి. ఇట్లు వదిలి పారిపోవడం, ఆత్మహత్య చేసుకోవడం లాంటి చర్యలకు పాల్పడుతుంటారు. తల్లిదండ్రులు, విద్యాబోధకులు పిల్లల మనసును తెలుసుకుంటూ అవసరానికి అనుగుణంగా వారిని తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి. మానసిక, సామాజిక వికాసం పొందకుండా ర్యాంకులు మాత్రమే సాధించాలన్న ధోరణి విడనాడాలి. పిల్లల్ని సంపూర్ణ వ్యక్తులుగా రూపుదిద్దాలి.