డిప్రెషన్ – కారణాలు, లక్షణాలు | Reasons For Depression in Telugu

0
4162
Reasons for depression
డిప్రెషన్ – కారణాలు, లక్షణాలు | Reasons For Drepression in Telugu

3. కారణాలు:

రోజురోజుకు పెరిగిపోతున్న చదువుల ఒత్తిళ్ళు యువతలో డిప్రెషన్ రావడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. పిల్లల ఇష్టానికి వ్యతిరేకంగా చదివించడం, వారి శక్తికి మించిన ఫలితాలు ఆశించడం జరుగుతుంది.

దీనితో నిద్ర ఆహారాలను కూడా పట్టించుకోకుండా చదవాల్సి వస్తుంది. ఏ మాత్రం మార్కులు తగ్గినా లెక్చరర్ల వేధింపులు, తల్లిదండ్రుల సాధింపులు ఎక్కువవుతాయి. తోటి పిల్లలనుంచి అవహేళనలు ఎదురవుతాయి.

ఈ దశలో లేత హృదయాలు గాయమై, మనసు కృంగిపోతుంది. ఒత్తిడి, విసుగు, విరక్తి, నిస్సహాయత, ఆత్మనూన్యత లాంటి సమస్యలు తలెత్తుతాయి. కొందరిలో తీవ్రమైన డిప్రెషన్ చోటు చేసుకుంది.

అలాగే ప్రతికూల పరిసరాలు, అనుకూలం కాని గృహవాతావరణం, విద్యా సంస్థల తీరుతెన్నులు పిల్లలను డిప్రెషన్ కు గురిచేస్తుంటాయి. ఏ మాత్రం సరదాలు, షికార్లు లేని దినచర్యలు, ఆటలు, పాటలు లేని జీవితం యువతలో మానసిక కృంగుబాటుకు దారితీస్తుంది.

మానసిక ఒత్తిళ్లు, డిఫ్రెషన్ కు గురైన పిల్లల్లో పలు రకాల వ్యక్తిత్వ, ప్రవర్తనా లోపాలు తలెత్తుతాయి. ఒక్కోసారి తీవ్ర పరిణామాలైన ఆత్మహత్యలకు కారణమవుతాయి.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here