
10 avataras of Lord Shiva
పరమశివుని దశావతారాలు
పరమ శివునికి అనేక నామములు ఉన్న విషయం మనందరికి తెలిసినదే. కానీ, అడిగిన వెంటనే వరాలిచ్చే భోళా శంకరుడు అయిన పరమ శివునకు కూడా విష్ణుమూర్తి వలె దశావతారములున్నాయి. ఒక్కొక్క అవతారం ఒక్కొక్క ప్రయోజనం కలిగి ఉంటుంది. శతరుద్ర సంహితాలలో నందీశ్వరుడు, సనత్కుమారునకు ఈ ఈశ్వరావతారమును వివరిస్తాడు. ఆ అవతారాలు ఏమిటో తెలుసుకుందాం.
- మహాకాలావతారం: సత్పురుషులందరికీ భుక్తిని, ముక్తిని ఇస్తే మహాకాళుడి అవతారం. ఈ అవతారంలో మహాకాళుడికి పత్నిగా ‘మహాకాళీదేవి’ ఉంటుంది.
- తారేశ్వరావతారం: పరమేశ్వరుడి రెండో అవతారం తారేశ్వరుడు. ఈ అవతారంలో ‘తారాదేవి’ స్వామికి ప్రియపత్నిగా ఉంటారు. వీరిద్దరూ తమ భక్తులను అనుక్షణం కాపాడుతుంటారు.
- బాలభువనేశ్వరావతారం: పరమేశ్వరుడు ధరించిన మూడవ అవతారం బాలభువనేశ్వరుడు. ఈ అవతారంలో స్వామికి ‘బాలభువనేశ్వరీదేవి’ భార్యగా ఉంటారు.
- షోడశివిద్యేశ్వరావతారం: పరమేశ్వరుడు నాలుగవ అవతారం షోడశివిద్యేశ్వరుడు. ఈ అవతారంలో స్వామికి ‘షోడశివిద్యేశ్వరీదేవి’ భార్యగా ఉంటారు.
- భైరవావతారం: భైరవావతారం పరమేశ్వరుడి అయిదవ అవతారం. ఈ అవతారంలో స్వామికి భార్యగా ‘భైరవీదేవి’ ఉంటారు. ఈమె ఉపాసకుల కోరికలను తీరుస్తుంది.
- చిన్నమస్తకేశ్వరావతారం: పరమేశ్వరుడి ఆరో అవతారం చిన్నమస్తకేశ్వరుడు. ఈ అవతారంలో స్వామికి ‘చిన్నమస్తాదేవి’ భార్యగా ఉంటారు. ఈమె భక్తుల అభీష్టాలను నెరవేరుస్తుంది.
- ధూమవంతావతారం: పరమేశ్వరుడు ధరించిన ఏడవ అవతారం ధూమవంతుడు. ఈ అవతారంలో స్వామికి భార్యగా ‘ధూమావతీదేవి’ ఉంటారు. వీరిద్దరూ తమని ఉపాసించే సాధకుల మనోరథాలను నెరవేరుస్తుంటారు.
- బగళాముఖావతారం: ఎనిమిదవ అవతారం బగళాముఖుడు. ఈ అవతారంలో స్వామికి భార్యగా ‘బగళాముఖీదేవి’ ఉంటారు. ఈమె మహానందాదేవిగా కూడా విఖ్యాతి పొందింది.
- మాతంగేశ్వరావతారం: తొమ్మిదవ అవతారం మాతంగేశ్వరుడు. ఈ అవతారంలో స్వామికి భార్యగా ‘మాతంగీదేవి’ ఉంటారు. వీరిద్దరూ తమ భక్తుల అభీష్టాలను నెరవేరుస్తుంటారు.
- కమలేశ్వరావతారం: పదవ అవతారం శ్రీ కమలేశ్వరుడు. ఈ అవతారంలో స్వామికి భార్యగా ‘కమలాత్మికాదేవి’ ఉంటారు.
ఈ పది శివావతారాలు భక్తులకు సుఖాన్ని, భుక్తిని, ముక్తిని ఇస్తాయి. పరమేశ్వరుడి ఈ పది అవతారాలను భక్తి, శ్రద్ధలతో నిత్యం సేవించిన వారికి ఎన్నో సుఖాలు కలుగుతాయి. ఈ పది అవతారాలు తంత్ర శాస్త్రానికి సంబంధించినవి. ఈ పది అవతారాల్లో పరమేశ్వరుడికి భార్యలుగా ఉన్న శక్తి స్వరూపిణులు ‘దశమహావిద్యలుగా‘ ప్రసిద్ధి చెందారు.
Related Posts:
Temples where liquor is offered as prasad | మద్యం ప్రసాదంగా అందించే దేవాలయాలు
Panchabhuta Lingas | పరమశివుడు ఐదు లింగాల రూపంలో ఉన్న ప్రదేశం
Temple Larger Than a Country | ఒక దేశం కంటే పెద్దగా ఉన్న దేవాలయం ఎక్కడ ఉంది?