Daily Rituals to Remove Life’s Obstacles | ఆరోగ్యం మరియు శ్రేయస్సును పెంచడం కోసం ప్రతినిత్యం తప్పక పాటించాల్సిన కొన్ని ఆచారాలు

0
669

 

Some rituals that must be followed daily.ప్రతినిత్యం తప్పక పాటించాల్సిన కొన్ని ఆచారాలు
Some rituals that must be followed daily

Essential rituals to overcome obstacles

1ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం పాటించాల్సిన ఆచారాలు

ప్రతిరోజు మన ఇంట్లో పాటించే కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు, అనుసరించే నమ్మకాలు మన జీవన విధానంలో ఆధ్యాత్మికతను, ఆరోగ్యాన్ని మరియు శ్రేయస్సును మెరుగుపరుస్తాయి. ఇవి శాస్త్రీయంగా కాకపోయినా, మన తాతముత్తాతల అనుభవజ్ఞానం ఆధారంగా వచ్చినవి. ఈ ఆచారాలను సరియైన దృక్పథంతో పాటించడం వల్ల మనలో నెగటివిటీ తగ్గి, శ్రేయస్సు మరియు సాంతం పెరుగుతాయి.ఇప్పుడు అందులో కొన్నిటి కోసం తెల్సుకుందాం.
  1. బట్టలుని, ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికినీరు, శరీరం పై ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు.
  2. భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు.
  3. సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కనుండి, ఒక్క ఆకును కూడా తెంచకూడదు.
  4. మంచం మీద కూర్చోని భోజనం చేయకూడదు.
  5. శ్రీ లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు.
  6. డబ్బును లెక్కించేటప్పుడు ఉమ్మిపెట్టి లెక్కించకూడదు.
  7. ప్రతీసారి ఇచ్చిపుచ్చుకునేటప్పుడు, కేవలం కుడిచేతిని మాత్రమే ఉపయోగించాలి. ఎడమచేతిని
    ఉపయోగించకూడదు.
  8. నేలమీద పడిన ఆహారాన్ని, కాలితో అస్సలు తొక్కకూడదు.
  9. పూజ చేసేటప్పుడు నుదుటన కుంకుమ బొట్టు ధరించకుండా చేయకూడదు.
  10. చీకటి పడిన తర్వాత, ఇంట్లో లైట్ వేసిన తర్వాత, ఇల్లు ఊడవడం మంచిది కాదు.
  11. రోలు, రోకలి బండలు పాత్రలు కడగకుండా అశుభ్రంగా ఉంచుతారని, అలా ఉంచడం వల్ల కూడా, నష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
  12. చీకటిలో భోజనం చేయకూడదు.
  13. మహిళలు మంగళ సూత్రాలకు, దేవుడు బొమ్మలు, సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు.
  14. పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు.
  15. పగిలిన అద్దాన్ని కూడా ఇంటిలో ఉంచకూడదు.
  16. తల వెంట్రుకలు, గోర్లు ఇంటిలో వేయరాదు.
  17. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు.
  18. గడపపై పాదం పెట్టి వెళ్లరాదు.
  19. శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందు ఉండాలి.అశుభానికి వెళ్తున్నప్పుడు పురుషులు  ముందు ఉండాలి.
  20. తులసి కోటను ఎప్పుడూ, ఇంటి గోడలకు ఆణించి నిర్మించరాదు.
  21. ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే, అవి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి.
  22. పూజ చేసేటపుడు ఎప్పుడూ, తూర్పు లేదా ఉత్తర దిశలలో మాత్రమే చేయాలి.
  23. ఇంటికి ఉత్తర మూలల్లో బరువైన వస్తువులు పెట్టకూడదట, ఇలా చేస్తే ఇంట్లో వారి మధ్య గొడవలు తలెత్తే ప్రమాదం ఉందట.
  24. చూపుడువేలుతో బొట్టు పెట్టుకోరాదు.

ఈ ఆచారాలు మరియు నమ్మకాలను సరైన దృక్పథంతో ఆచరిస్తే మనలో శ్రేయస్సు, సౌకర్యం పెరుగుతాయి. 

ఇలాంటి మరెన్నో విషయాలు మరియు మన సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవటానికి ఇప్పుడే 9059-777-789 కి “హరిఓం” అని మెసేజ్ చేయండి.

Related Posts

Ayyappa Swami rituals| కుటుంబంలో మరణం జరిగితే, స్వామి మాలను కొనసాగించాలా?

Kumbh Mela 2025 | కుంభమేళా వెనుక ఉన్న రహస్యాలు, కథలు ఇవేనా?

మూఢం అంటే ఏంటి? ఆ రోజుల్లో ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు.