
This is what happens when we use red color for pooja room:
పూజ గదిలో ఎరుపు రంగు
పూజ అంటే మానసిక ప్రశాంతత కోసం చేసే ఆధ్యాత్మిక ప్రక్రియ. కానీ, పూజలో ఆ ప్రశాంతత లేకుండా చేస్తే ఫలితం తగ్గిపోతుంది. “మనసు పెట్టి చేస్తేనే పూజ” అంటారు. మనసుపై ప్రభావం చూపే అంశాల్లో రంగులు ముఖ్యమైనవి. ముఖ్యంగా పూజ గదిలో ఎరుపు రంగు వాడితే దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోండి.
పూజ గదిలో వాస్తు నియమాలు: పూజ గదిని పవిత్రంగా భావించి వాస్తు నియమాల ప్రకారం నిర్మించాల్సి ఉంటుంది. పూజ గదిని అందరికీ ఇష్టమైన విధంగా డిజైన్ చేస్తారు. అయితే, పూజ గదిలో ఎరుపు రంగు వాడకూడదు అని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఈ రంగు నెగటివ్ ఎనర్జీని కలిగించే ప్రమాదం ఉంది.
ఎరుపు రంగు ప్రభావం: ఎరుపు రంగు అనేది అగ్ని తత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఈ రంగం ప్రశాంతతను తగ్గించడంలో ప్రభావం చూపుతుంది. పూజ గదిలో ఈ రంగం వాడటం వలన ఇంట్లో శాంతి లోపించవచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మంగళ గ్రహంతో సంబంధం: ఎరుపు రంగు మంగళ గ్రహంకు సంబంధించినది. ఈ గ్రహం సంఘర్షణకు ప్రతీక. పూజ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండటం ముఖ్యమైన అంశం. కానీ ఎరుపు రంగు మనసును ప్రభావితం చేస్తుందని, ఏకాగ్రతకు భంగం కలిగిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా శివ పూజలో ఎరుపు రంగు నిషిద్ధం.
ఎరుపు రంగు దుష్ప్రభావాలు:
- ఏకాగ్రతకు అంతరాయం.
- కళ్లు, మెదడుపై ప్రభావం.
- మానసిక ఆందోళన కలిగిస్తుంది.
మంచి రంగుల ప్రాధాన్యత:
పూజ గదిలో తెలుపు, పచ్చ, నీలం, పసుపు వంటి లైట్ కలర్స్ వాడితే పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఈ రంగులు మనసుకు హాయిని ఇచ్చి శాంతి చేకూరుస్తాయి.
Related Posts
Hanuman Photo Placement Tips | వాస్తు ప్రకారం, హనుమంతుని ఫోటో ఇంట్లో ఏ దిశలో పెట్టాలి?
Vastu tips | ధనాన్ని, సానుకూలతను, సంపత్తిని ఆకర్షించే వాస్తు చిట్కాలు ఇవే !
స్త్రీలు మంగళసూత్రం విషయంలో ఈ తప్పులు చేస్తే భర్తకు ఆయుక్షీణం |Significance of Mangalsutra