బ్రహ్మ ముహూర్తంలో ఇలా చేస్తే మీ ఇంట్లో బంగారు రాశులే | Brahma Muhurtham

0
2963
Brahma Muhurtha
Brahma Muhurtha Significance

Brahma Muhurtha (Brahmamuhurtha)

2బ్రహ్మ ముహూర్తంలో చేయవలసిన పనులు (What Things to Do in Brahma Muhurtham?)

1. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి ఓంకారంను 21 సార్లు స్మరించాలి.
2. దాని తర్వాత 21 నిమిషాలు ధ్యానం మరియు శ్వాస మీద ధ్యాస పెట్టాలి.
3. తులసి మొక్కలో లక్ష్మీదేవి ఉంటుంది అని నమ్మకం కాబట్టి తులసి మొక్కకు ఎల్లప్పుడూ నీటిని పోస్తు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే విష్ణు మంత్రాన్ని జపించండి. ఇలా చేస్తే నిత్యం మీ ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం ఉంటుంది.
4. రోజూ ఉదయాన్నే స్నానం చేసి రాగి పాత్రలో నీళ్లు తీసుకుని అందులో పూలు వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. ఇలా చేయడం వల్ల మీకు వ్యాధులు చుట్టముట్టవు, చాలా సమస్యలు దూరమవుతాయి అంటారు.
5. ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర నెయ్యి దీపం వెలిగించితే సకల దేవతలు సంతోషిస్తారు అని నమ్మకం. అలాగే రోజూ ఇలా దీపం వెలిగించడం వల్ల ఇంటిలోని వాస్తు దోషాలు తొలగిపోతాయంట.