
Bhagalamukhi Devi Dasamahavidya
1. భగలాముఖీ జయంతి
వైశాఖ శుక్ల అష్టమి భగలాముఖీదేవి అవతరించిన రోజు ఆరోజుని భగళా ముఖి జయంతిగా జరుపుకుంటారు. తాంత్రిక ఉపాసనలలో భగళాముఖీ దేవి స్థానం చాలా విశిష్టమైనది.
భగళాముఖి ఎవరు? ఆమె ఎలా ఉంటుంది ?
శక్తి విద్యాస్వరూపిణిగా అవతరించిన పది అవతారాలు దశమహావిద్యలు. ఆ పరావిద్య రూపాలైన దశమహావిద్యలలో ఒకటి భగళాముఖీ దేవి. ఆమెనే బగల,భగలా , వగళ అనికూడా అంటారు. పీతాంబర దేవి, బ్రహ్మాస్త్రరూపిణి అని అమ్మకు పేర్లు. ఆమె పసుపు వస్త్రాలను ధరించి, గదాధారిణియై మాదనుడనే రాక్షసుని నాలుకను ఛిద్రం చేస్తున్న రూపం లో కనబడుతుంది. కొన్ని చోట్ల అమ్మవారి రూపం నాలుగు చేతులతో దర్శనమిస్తుంది.
భగళాముఖి అవతార కథ
ఒకనాడు భూమండలంపై పాపభారం వలన ప్రళయం సంభవించింది. బ్రహ్మ రుద్రాదులు సౌరాష్ట్ర ప్రాంతం లో సమావేశమై పరిష్కారం కొరకు అన్వేషించారు. ఆ సమయం లో అక్కడగల హరిద్రా సరోవరం నుండీ భగళా ముఖీ దేవి ఉద్భవించి భూమండలాన్ని పరిరక్షించింది. దేవీ పురాణంలో చెప్పబడ్డ హరిద్రా సరోవరాన్ని పోలిన సరోవరం మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని దాటియా లోగల పీతాంబర పీఠం లో ఉంది.
భగళా ముఖి అవతారానికి సంబంధించి మరొక కథ ప్రచారం లో ఉంది. మాదనుడనే రాక్షసుడు త్రిమూర్తుల కొరకు ఘోర తపస్సుని ఆచరించాడు. అతని తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు వరం కోరుకోమని అడుగగా, తాను ఏది మాట్లాడితే అది సంభవించాలని అజేయమైన వాక్శుద్ధిని కోరుకున్నాడు. అందుకు త్రిమూర్తులు గత్యంతరం లేక సమ్మతించారు. వరం సహాయంతో ఆ రాక్షసుడు ముల్లోకాలనూ నాశనం చేయనారంభించాడు. అప్పుడు ఉగ్రరూపిణియైన కాళిక భగళా ముఖిగా అవతరించి అతని నాలుకను ఛిద్రం చేసింది.
భగళాముఖి ఉపాసన ప్రభావం
శత్రువులను స్తంభింపజేయడం భగళా ముఖి లక్షణం. శత్రుపీడలు తొలగి, ప్రమాదాలు నివారించబడతాయి. భగళా ముఖీదేవిని తాంత్రికంగా కాకుండా సాత్వికంగానూ పూజించవచ్చు.
భగళా ముఖిని ఎలా ఆరాధించాలి
భగళా ముఖీ దేవిని తాంత్రిక ఉపాసన చేయదలచిన వారైనా, సాత్విక ఉపాసన చేయదలచినవారైనా తప్పని సరిగా గురువు అనుమతి తీసుకోవాలి. అమ్మవారి యంత్రాన్ని ప్రతిష్టించి నియమ నిష్టలతో స్తోత్రాన్ని పఠించాలి.
భగళాముఖీ స్తోత్రం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రసిద్ధమైన భగళా ముఖీ ఆలయాలు
-
- గౌహతి లోని కామాఖ్య ఆలయం లో దశమహా విద్యల ఆలయాలు ఉన్నాయి. వాటిలో భగళాముఖి ఆలయం ఒకటి.
- హిమాచల్ ప్రదేశ్ లోని బంఖండి లో భగళాముఖి ఆలయం ఉన్నది.
- మధ్యప్రదేశ్ లోని నల్ఖెడా లోనూ దాటియా లోనూ భగళాముఖి దేవి ఆలయాలు ఉన్నాయి.
- తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లాలోగల పాపంకుళం లోనూ, కళ్ళిడై కురిచ్చి లోనూ భగళాముఖి దేవిని దర్శించవచ్చు.
- ఉత్తర కర్ణాటక లోని సోమాల్పురా లో భగళాముఖి సిద్ధ పీఠం ఉంది. అమ్మవారు అక్కడి సిద్ధుని భక్తికి మెచ్చి స్వయంగా కొలువై ఉన్నదని స్థలపురాణం చెబుతుంది. ఈ ఆలయం సుమారు 300 యేళ్ళ నాటిది.
- నేపాల్ లోని పఠాన్ లో భగళాముఖి ఆలయం ఉంది.
Related Posts
దేవతా విగ్రహాలకు ఎలా నమస్కరించాలి? | How to Worship Goddess idol in Telugu
Sri Lalitha Sahasranama Stotram in Telugu | శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం
Goddess of Poverty | ఇంటి మీద దరిద్ర దేవత ఉందని సూచించే లక్షణాలు ఇవే !
Key Signs of Goddess Lakshmi | మీ ఇంట్లో ఈ సంకేతాలు ఉన్నాయా? అయితే లక్ష్మి దేవి వచ్చినట్టే!
