
Mudras for Instant Relief From Menstrual Pain – ఆడవారు నిత్య జీవనం లో ఎదుర్కొనే ఋతు సమస్యలకు బద్ధ కోణాసనం చక్కని పరిష్కారం. బద్ధ కోణాసనాన్నే బటర్ ఫ్లై పోస్ (butter fly pose) అంటారు. అతి సులభమైన ఈ ఆసనం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
2. బద్ధ కోణాసనం ఎలా వేయాలి..?
- కాళ్ళను ముందుకు జాపి వెన్ను నిటారుగా ఉండేలా కూర్చోవాలి.
- మెల్లిగా మోకాళ్ళ దగ్గర వంచి కాళ్ళను మీ వైపుగా మడవాలి.
- రెండు అరిపాదాలూ ఒకదానికి ఒకటి తాకేలా దగ్గరికి తీసుకురావాలి.
- అరిపాదాలు విడివడకుండా రెండు చేతులతో వాటిని పట్టుకుని ఉండాలి.
- మెల్లిగా మోకాలి భాగం నేలకు ఆనించడానికి ప్రయత్నించాలి. (పైన పటం లో చూడండి)
- సీతాకొక చిలుక రెక్కల లాగా కాళ్ళను (మోకాలి భాగాలను పైకి కిందకూ) ఆడించాలి.
- ఆసనం చేస్తున్నంత సేపూ ఊపిరిని దీర్ఘంగా తీసుకుంటూ వదలాలి.
- ఇలా రోజుకు కనీసం పది నిముషాలు సాధన చేయడం మంచిది.
Promoted Content