ప్రతి రోజు హనుమాన్ చాలీసా చదవడం వల్ల పొందే ప్రయోజనాలు | Benefits of Reciting the Hanuman Chalisa

0
891
Benifits of chanting hanuman chalisa
Benefits of Reciting the Hanuman Chalisa

What are the Spiritual Benefits of Chanting Hanuman Chalisa

2ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? (What are the Benefits of Chanting Hanuman Chalisa Everyday?)

హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం..

హనుమాన్ చాలీసాని ఎన్ని సార్లు ఏ సమయంలో పఠించాలి?! (How Many Times to Recite Hanuman Chalisa at What Time?!)

రాముని భక్తుడైన హనుమంతుడు కలియుగ దేవుడి గా భావిస్తారు. హనుమాన్ చాలీసా సంతతంగా పఠించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. హనుమాన్ చాలీసా భక్తి శ్రద్దలతో పఠిస్తే హనుమంతుడు భక్తుల కష్టాలు అన్నింటినీ తీరుస్తాడు. ఆయన అనుగ్రహంతో జీవితంలో ఏ కష్టాలు భక్తుల ను ఇబ్బంది పెట్టవు.

రోజు ఉదయాన్నే 11 సార్లు హనుమాన్ చాలీసా పఠించాలి. అల చేయలేని వారు ఉదయం స్నానం చేసి రాత్రి పడుకునే లోపల మీకు సమయం ఉన్నప్పుడు పూర్తి చేయవచ్చు అని చెబుతున్నారు. ఇలా చేయడం వలన అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఇది స్తోత్రమే కనుక నియమాలు అంతగా లేదని జ్యోతిష్యులు చెబుతున్నారు.

చిన్న పిల్లలకు వచ్చే అంటువ్యాధులు కానీ, జ్వరాలు కానీ, దృష్టి శక్తుల నుండి కాపాడుకోవడం కోసం చేతిలో విభూతి తీసుకుని 11 సార్లు హనుమాన్ చాలీసా పఠించి ఆ విభూతి పిల్లలకు పెడితే వారికి రక్షగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మన జాతకంలో గండ దోషాలు ఉన్నవారు మరియు వాహనం వల్ల కలిగే రోడ్డు ప్రమాద గడ్డం ఉన్నవారు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే వాటి నుంచి తప్పించుకోవచ్చు అని చెప్తున్నారు.

మృగశిర నక్షత్రం హనుమంతుడికి అత్యంత ఇష్టమైన నక్షత్రం. మృగశిర నక్షత్రం రోజున మొదటిసారిగా హనుమంతుడు సీత దేవి అమ్మవారి దర్శనం చేశారని పురాణ కథలు చెపుతున్నాయి.

హనుమాన్ చాలీసాను పఠించే భక్తులకు బలం మరియు జ్ఞానాన్ని అందించడమే కాకుండా, వారి దుఃఖాలను కూడా తొలగిస్తారు అని పండితులు చెబుతున్నారు.

హనుమంతుడుకి అపారమైన శక్తి ఉంది. ఆయన అమితమైన శక్తి కలిగినవాడు చాలీసాను నిరంతరం పఠించే భక్తులను దుష్ట శక్తులు బాధించవు, ఎలాంటి భయం ఉండదు. చాలీసాను పఠించడం వలన ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలు మెరుగు పడతాయి. హనుమాన్ చాలీసాను 100 సార్లు పఠించే భక్తులకు అన్ని రకాల బంధాల నుండి విముక్తి పొంది గొప్ప ఆనందాన్ని పొందేలాగా హనుమాన్ ఆశీర్వదిస్తారు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.