
ayurvedic remedies for migraine
5. ఆయుర్వేద చికిత్స, సూచనలు
తలనొప్పి కేంద్రీకృతమైన ప్రదేశంలో ఐస్ నీళ్ళతో తడి పిన చల్లని గుడ్డను లేదా మంచుగడ్డలు చుట్టిన మూటను ప్రయోగించాలి.
దీనివల్ల వ్యాకోచించిన రక్తనాళాలు తిరిగి మామూలు స్థితికి చేరుకుంటాయి. తలనొప్పి మొదలైన వెంటనే ఒక చీకటి గదిలోకి వెళ్ళి విశ్రాంతి
తీసుకోవాలి. మహాచందనాది తైలం వంటివాటితో తలను, కణతలను, అరికాళ్ళను సున్నితంగా మసాజ్చేసుకోవాలి. నిద్రపోవటానికి ప్రయత్నించాలి.
మైగ్రెయిన్లో నస్యకర్మవల్ల చక్కని ఫలితం కనిపిస్తుంది. లక్షణ తీవ్రత, ప్రాబల్యాలను బట్టి సరైన ఔషధ సిద్ధ తైలాన్ని నిర్ణయించి ముక్కుద్వారా ప్రయోగించటం నస్యకర్మ లోని ప్రధాన ప్రక్రియ. దీనివల్ల తలలోని దోషాలు సమస్థితి లోకి వచ్చి నొప్పి తగ్గుతుంది.
ధార చికిత్స కూడా తలనొప్పి తగ్గుతుంది. మానసిక వత్తిడి ఎదురైనప్పుడు చాలా మందికి నుదురు ప్రాంతంలో చెమట పడుతుంది.
కొంతమంది టెన్షన్ తగ్గించుకోవడానికి గాని, ఆలోచనలకు పదును పెట్టుకోవడానికి గాని నుదురు రుదుకుంటారు. దీనినిబట్టి నుదురు అనేది టెన్షన్ని బయట పడేసేందుకు తోడ్పడే ముఖ్యమైన ప్రదేశమని మనకు అర్థమ వుతుంది.
ఆయుర్వేద ‘ధారా చికిత్సతో ఈ ప్రదేశాన్ని శక్తి వంతం చేయవచ్చు. ఔషధ సిద్ధ తైలాన్ని నుదురుమీద ధారగా పడేలా చేయటం దీనిలో ప్రధాన ప్రక్రియ. ఈ చికిత్స మైగ్రెయిన్లో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఒత్తిడి కారణంగా వచ్చే సైకోసొమాటిక్ వ్యాధుల్లో అత్యంత ఉపయోగ కారి.
మైగ్రెయిన్లో సువర్ణ సూరావర్తి సూతశేకరరసం, దశ మూలారిష్టం, గోదంతి భస్మం, ప్రవాళపిష్టి గుడూచి సత్వం వంటి ఔషధాలు అనేకం నమ్మకంగా పనిచేస్తాయి. వీటిని వైద్య సలహాను అనుసరించి వాడుకుంటే తప్పకుండా ఫలితం కనిపిస్తుంది.
గృహచికిత్సలు
తిప్పతీగ స్వరసాన్ని రెండు చెంచాలు మోతాదుగా, తేనెతో కలిపి రెండు పూటలా తీసుకోవాలి. అలాగే, ఆవు నెయ్యిలో కుంకుమ పువ్వును వేసి ఒక్కో ముక్క రంధ్రంలో రెండేసి చుక్కల చొప్పన వేసుకుని బలంగా పీల్చాలి. నుదురుకు కణతలకు చందన లేపాన్ని (మంచి గంధం పేస్టును) రాసుకోవాలి.