
ayurvedic remedies for migraine
3. లక్షణాలు
మైగ్రెయిన్ తలనొప్పి సాధారణంగా మూడు దశలుగా వస్తుంటుంది. మొదటిది హెచ్చరిక దశ. రెండవది ఆరా లేక పూర్వరూపదశ. మూడవది పూర్తిస్థాయి రూపదశ.
మొదటిదశ మైగ్రెయిన్ కు ముందు హెచ్చరిక పూర్వకమైన లక్షణాలతో మొదలవుతుంది. మానసికస్థితి లోను, మూడ్లోను మార్పు రావటం, నీరసం, కడుపుబ్బ రింపు, కండరాలు పట్టేసినట్లు ఉండటం, ఆవలింతలు, ఆహరపదార్ధాలపట్ల మితిమీరిన వ్యామోహం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
తలనొప్పికి కొన్ని గంటల ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి.
రెండవ దశ ఆరా, ఇది మైగ్రెయిన్ కు ముందు పూర్వ రూపాలతో కనిపించే స్థితి. దీని లక్షణాలు పావుగంట నుంచి అరగంట వరకూ కొనసాగుతాయి.
కళ్ళముందు మెరుపులు మొరిసినట్లు ఉండటం, తాత్కాలికంగాను, పాక్షికంగాను చూపు కోల్పోవటం, మాట్లాడలేకపోవటం, కాళ్ళూ చేతుల్లో బలహీనత ప్రాప్తించటం, ముఖంలోనూ, చేతుల్లోనూ తిమ్మిర్లుగానూ అవిశ్రాంతంగానూ, ఆరాటంగాను అనిపించటం, అయోమయం ఆవహించటం ఇవన్నీ మైగ్రెయిన్కు ముందు కనిపించే లక్షణాలు.
అలా కనిపించడం మొదలైన తరువాత, దాదాపు గంటవ్యవధిలో అసలైన మైగ్రెయిన్ లక్షణాలు కనిపించడం మొదలెడ. మైగ్రెయిన్లో సాధారణంగా తలలో ఒక పక్కనే
నొప్పి వస్తుంది. అందుకే దీనిని ఆయుర్వేదంలో అర్దావభేదం అంటారు. కొన్ని సందర్భాల్లో రెండు పక్కలా రావచ్చు. తలనొప్పి తీవ్రాతి తీవ్రంగా వస్తుంది.
నొప్పి లక్షణం పొడుస్తున్నట్లు (ద్రాబింగ్) ఉబుకుతున్నట్లు (పల్లేటింగ్) ఉంటుంది. కదలికతో తలనొప్పి ఎక్కుమవుతుంది.
అనుబంధ లక్షణాలుగా వాంతులు, వికారం ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నీళ్ల విరేచనాలు కూడా కావచ్చు.
కాంతినీ శబ్దాలనూ సహించలేకపోవటం మైగ్రెయిన్ ప్రధాన లక్షణం. కండరాల నొప్పులు, సలుపులు ఉంటాయి. తల తిరుగుతున్నట్లు కళ్లు తిరిగి పడి పోతున్నట్లు అనిపిస్తుంది.