అయోధ్యలో మొదటి వార్షికోత్సవం – ఉత్సవాల షెడ్యుల్

0
39
Ayodhya's first anniversary
Ayodhya temple’s first anniversary

Ayodhya

అయోధ్య బాల రామయ్య మొదటి వార్షికోత్సవం

కోట్లాది హిందువుల ఆరాధ్యదైవం రామయ్య జన్మించిన అయోధ్యలో బాల రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా భారీ ఉత్సవాలు నిర్వహించబడతాయి. శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మొదటి వార్షికోత్సవాన్ని జరపాలని ప్రకటించింది. ఈ ఉత్సవాలు జనవరి 22కి బదులుగా జనవరి 11న నిరవహించనున్నారు.

ఉత్సవాల నిర్వహణ షెడ్యుల్:

ఆలయ సముదాయంలోని యాగ మండపంలో కార్యక్రమాలు:

  • శుక్ల యజుర్వేద మధ్యదాని శాఖలోని 40 అధ్యాయాల అలాగే 1975 మంత్రాలను అగ్నిదేవునికి సమర్పించబడతాయి.
  • 11 వేద మంత్రాలను పఠిస్తారు.
  • ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పూజలు, యాగాలు జరుగుతాయి.
  • శ్రీరామ మంత్రాన్ని పఠించే యాగం రెండు సెషన్లలో జరుగుతుంది.
  • 6 లక్షల మంత్రాలు జపించబడతాయి.
  • రామరక్షా స్తోత్రం, హనుమాన్ చాలీసా, పురుష సూక్త, శ్రీ సూక్త, ఆదిత్య హృదయ స్తోత్రం, అథర్వశీర్ష వంటి స్తోత్రాలు పారాయణం చేస్తారు.

రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్‌లో కార్యక్రమాలు:

  • ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు దక్షిణ వైపున ఉన్న ప్రార్థనా మందిరంలో బాల రామయ్యకు రాగసేవ సమర్పిస్తారు.
  • ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో బాల రామయ్య సన్నిధిలో అభినందన గీతాలను కీర్తిస్తారు.

సంగీత మానస విభావరి:

ప్రయాణీకుల సౌకర్యాల కేంద్రం 1వ అంతస్తులో మూడు రోజుల పాటు సంగీత మానస విభావరి కార్యక్రమం నిర్వహిస్తారు.

అంగద్ తిలా మైదానం:

  • మధ్యాహ్నం 2 నుంచి 3:30 వరకు రామ్ కథ.
  • 3:30 నుంచి 5 గంటల వరకు రామ చరిత మానస్ గురించి ప్రవచనం జరుగుతుంది.
  • సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు.

అన్నప్రసాద వితరణ:

జనవరి 11వ తేదీన ఉదయం నుండి స్వామివారికి అన్నప్రసాద వితరణ ప్రారంబించబడుతుంది.
అంగద్ తిల మైదానంలో నిర్వహించనున్న అన్ని కార్యక్రమాలకు అన్ని సంఘాలను ఆహ్వానించారు.

భద్రతా ఏర్పాట్లు:

  • మొదటి వార్షికోత్సవం కోసం అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయబడతాయి.
  • భక్తులు ఎలాంటి ఆంక్షలు లేకుండా వేడుకల్లో పాల్గొనవచ్చు.
  • స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి ఆస్వాదించవచ్చు.

Related Posts:

Daughters and Funeral Rites | కూతురు అంత్యక్రియలు చేస్తే ఆత్మకి శాంతి కలుగుతుందా?

Horoscope 2025 | జనవరిలో మాళవ్య రాజయోగంతో ఈ రాశుల వారికి ధన యోగం.

Unstoppable luck for the |2025లో రాశుల వారి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు.