Monthly Horoscope | ఆగష్టు మాస ఫలాలు 2024 | Masa Phalalu Telugu August 2024

0
297
August month horoscope
August Month Horoscope 2024

August Month Horoscope 2024

5మకర రాశి (Capricorn)

విద్యా: విద్యా రంగంలో మంచి పురోగతి ఉంటుంది. మీ కృషితో మంచి ఫలితాలు సాధిస్తారు.విదేశీ విద్య కోసం ప్రయత్నిముచే వారు మీ ప్రయత్నాన్ని కొంతకాలం వాయిదా వేసుకుంటే మంచిది.

వృత్తి: వృత్తి విషయం లో కొంత ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడతాయి.ప్రమోషన్స్ కొంతాకాలం వాయిదా పడవచ్చు.

వివాహం: వివాహ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది.క్రొత్తగా వివాహ ప్రయత్నాలు చేసే వారు తమ సోల్మెట్ ను కలుసుకుంటారు.

ఆరోగ్యం: ఆరోగ్యం సుభిక్షం గా ఉంటుంది.ఉత్సాహభరితమైన కార్యాలలో పాల్గొంటారు.

వ్యాపారం: చాల జాగ్రత్త గా ఉండాల్సిన సమయం,భాగస్వాములు మిమ్మల్ని నష్టపరిచే అవకాశం ఉంది.

సంతానం: సంతానానికి అనుకూల పరిస్థితులు ఉంటాయి.అన్ని రకాల అభివృద్ధి కనపడుతుంది.

పరిహారాలు:
1. పరమేశ్వరునికి పాలాభిషేకం చేయించండి.
2. మకర రాశి వారికి ప్రతిరోజూ శివపూజ చేయడం మంచిది.

కుంభ రాశి (Aquarius):

విద్య: విద్యా రంగంలో మంచి పురోగతి ఉంటుంది. మీరు కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఉత్సాహంగా ఉంటారు.

వృత్తి: వృత్తి రంగంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీ ప్రతిభను ప్రదర్శించేందుకు మంచి సమయం గా భావిస్తారు.

వివాహం: వైవాహిక జీవితం లో అనవసర అంశాల ప్రస్తావన వలన కలతలు వచ్చే అవకాశం ఉంది.నూతన వివాహ ప్రత్నాలు చేసే వారికి ఇది అనుకూల సమయం కాదు.

ఆరోగ్యం: శరీరం లో ట్రై గ్లిజరైడ్స్ ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది,సీనియర్ సిటిజన్స్ కి హృదయ సంభందిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

వ్యాపారం: వ్యాపారంలో మంచి లాభాలు సాధ్యమే. కొత్త వ్యాపార అవకాశాలు రావచ్చు.

సంతానం: సంతానానికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. పిల్లల ఆరోగ్యం మరియు విద్యపై శ్రద్ధ వహించండి.

పరిహారాలు:
1. తులసీ కవచం పఠించండి.
2. కుంభ రాశి వారు ప్రతిరోజూ గణేష్ పూజ చేయడం మంచిది.

మీనా రాశి (Pisces):

విద్యా: విద్యా రంగంలో మీరు మంచి పురోగతి సాధిస్తారు. మీ కృషి మరియు పట్టుదల ద్వారా విజయాలు లభిస్తాయి.

వృత్తి: వృత్తి విషయం లో అంత ఆశాజనకం గా ఉండకపోవచ్చు.పని చేసే ప్రాంగణం లో సహచరులతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.

వివాహం: వివాహ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది.నూతన వివాహ ప్రయత్నాలు చేసే వారికి ఈమాసం లో అనుకూల ఫలితాలు రాకపోవచ్చు.

ఆరోగ్యం: ఆరోగ్యం చక్కగా ఉంటుంది.శారీరక దృఢత్వం పెంచుకోవడానికి నడక ప్రారంభించడం,జిమ్ లో చేరడం వంటివి చేస్తారు.

వ్యాపారం: మీరు బాగా కష్ట పడినప్పటికీ ఆశించిన ఫలితాలు రాబట్టడం లో కొంత వెనుకబడతారు.సహచరుల వలన కొంత అసౌకర్యాయానికి లోను అవుతారు.

సంతానం: సంతానానికి సంబంధించి అనుకూల పరిస్థితులు ఉంటాయి.పరీక్షలలో విజయాలను పొందుతారు.

పరిహారాలు:
1. ఆంజనేయ స్వామి వారికి సింధూరాన్ని ఎక్కించండి.
2. పచ్చని పేసర్ల తో చేసిన పిండి వంటలను నైవేద్యం గా నివేదించండి

శుభం భూయాత్ !!
సర్వేజనా సుఖినోభవంతు

Related Posts

ప్రముఖ జ్యోతిష పండితుడు ఆచార్య రాఘవేంద్ర ఫ్రాన్స్ ఎన్నికల జోష్యం

Guru Shukra yuti 2024 | చాలా ఏళ్ల తర్వాత గురు శుక్ర అరుదైన కలయిక ఈ రాశుల వారి ధనలక్ష్మీ తాండవిస్తుంది.

https://hariome.com/moon-transit-in-cancer-zodiac-sign-people-are-lucky/

Shukra Nakshtra Gochar 2024 | శుక్ర నక్షత్రం రాశి మరుతుండటంతో ఈ రాశులవారికి అదృష్టం, చేతినిండా డబ్బు.

https://hariome.com/malavya-yoga-zodiac-signs-will-get-good-luck/

Gajalakshmi Rajyog | మేషరాశిలోకి, శుక్ర సంచారం వల్ల గజలక్ష్మి రాజయోగం, ఈ రాశులకు ధన లాభం.

https://hariome.com/surya-gochar-these-zodiac-signs-will-get-amazing-benefits/

Next