Monthly Horoscope | ఆగష్టు మాస ఫలాలు 2024 | Masa Phalalu Telugu August 2024

0
297
August month horoscope
August Month Horoscope 2024

August Month Horoscope 2024

4తులా రాశి (Libra):

విద్యా: విద్యా రంగంలో కొన్ని విఘ్నాలు, కానీ పట్టుదలతో నెమ్మదిగా ప్రగతి సాధించవచ్చు.

వృత్తి: వృత్తి రంగంలో కొత్త అవకాశాలు పొందవచ్చు. మీ సామర్ధ్యాన్ని ప్రదర్శించదానికి ఇది సరైన సమయం

వివాహం: భాగస్వామితో కొన్ని స్పర్ధలొచ్చే అవకాశం ఉంది.వివాహ ప్రయత్నాలలో మీరు మరింత లోతుగా ఆలోచన చెయ్యాల్సిన అవసరం ఉంది.

ఆరోగ్యం: శిరో సమస్యలు వచ్చే అవకాశం ఉంది.ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు సక్రమ ఆహారం మరియు జీవనశైలిని కొనసాగించాలి.

వ్యాపారం: వ్యాపారం లో చాలా జాగ్రత్త అవసరం.నష్టాలు,మోసాలు ఉండే అవకాశం ఉంది.

సంతానం: సంతానానికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి.దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి.

పరిహారాలు:
1. శారదా దేవికి నైవేద్యాలు సమర్పించడం.
2. తులా రాశి వారు అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేయడం మంచిది.

వృశ్చిక రాశి (Scorpio):

విద్యా: విద్యా రంగంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు, కానీ పట్టుదలతో మంచి ఫలితాలు సాధించవచ్చు. కొత్త విషయాలు నేర్చుకోవడం సులభం గా మారుతుంది

వృత్తి: వృత్తి రంగంలో కొన్ని ఆటంకాలు ఉంటాయి, కానీ మీరు తెలివిగా మరియు ధైర్యంగా ఎదుర్కొంటారు.ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.

వివాహం: వివాహ సంబంధాల్లో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు.మీరు మీ భాగస్వామితో సంభాషణ ద్వారా సమస్యలను పరిష్కరించగలుగుతారు.

ఆరోగ్యం: ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ ఒత్తిడి మరియు అనారోగ్యాన్ని నివారించడానికి ప్రశాంతం గా ఓపికతో ఉండాలని మీరు గ్రహిస్తారు.

వ్యాపారం: వ్యాపారంలో నూతన అవకాశాలు మరియు అభివృద్ధి.ఆశించిన ఫలితాలను పొందటం లో ఒత్తిడిని ఎదుర్కొంటారు.

సంతానం: సంతానానికి సంబంధించి అనుకూలమైన పరిస్థితులు ఉండకపోవచ్చు.కొన్ని సంఘటనలు మీ మనసును నొప్పిస్తాయి.

పరిహారాలు:
1. శివుడికి రుద్రాభిషేకం.శుభ ఫలితాలను ఇస్తుంది.

ధనుస్సు రాశి (Sagittarius):

విద్యా: విద్యా రంగంలో అవరోధాలను అధిగమించాల్సిన పరిస్థితి ఉంటుంది.తీపి పాదార్ధాలను తినడం తగ్గించడం ద్వారా ఉపయోగం ఉంటుంది.

వృత్తి: వృత్తి రంగంలో మంచి అవకాశాలు వస్తాయి. మీ ప్రతిభను ప్రదర్శించండి మరియు కొత్త ప్రతిపాదనలు అంగీకరించండి.

వివాహం: వివాహ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. మీ భాగస్వామితో ఆనందమైన సమయం గడుపుతారు.

ఆరోగ్యం: ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ స్వాస పరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

వ్యాపారం: దూర ప్రయాణాలు చేస్తారు.కష్టం ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్లు ఉంటుంది.

సంతానం: సంతానానికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి.కొన్ని ఆశ్చర్య కర సంఘటనలు మీకు ఆనందాన్నిస్తాయి.

పరిహారాలు:
1. ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ చేయించండి.
2. ధనుస్సు రాశి వారు ప్రతిరోజూ సూర్య నమస్కారం చేయడం మంచిది.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.