ఉబ్బసం (ఆస్త్మా) పై విజయం | Ayurveda Tips For Asthma in Telugu

0
2881
Ayurveda  Tips for Asthma
ఉబ్బసం (ఆస్త్మా) పై విజయం | Ayurveda Tips For Asthma in Telugu

3. వ్యవహార నియమాలు

  • ఆస్తమా వ్యాధిలో ఎయిర్ కండిషన్డ్ గదులు ఉపయుక్తంగా ఉంటాయని ఒక అభిప్రాయం ఉంది.
  • వేపుళ్ళు మొదలైనవి చేసేప్పుడు, తాలింపు వేసేటప్పుడు వంటగది నుంచి వెలువడే పొగ కొంతమందిలో ఉబ్బసాన్ని కలిగిస్తుంది. దీన్ని నివారించాలి.
  • పార్తీనియం (కాంగ్రెస్ గడ్డి) వంటి మొక్కల పుప్పొడి కారణంగా కొంతమందికి ఉబ్బసం వస్తుంది. పుప్పొడితో ఎలర్జీ ఉన్నవారు పుప్పొడి రాలే సమయంలో బయటకు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • ఉబ్బసానికి ప్రధాన కారణం దుమ్ము, ధూళి అని యోగరత్నాకరం అనే ఆయుర్వేద గ్రంథం పేర్కొంది.
  • జంతువుల రోమాలు, చర్మం నుంచి వెలువడే మృతకణాలు, మలమూత్రాల వాసనలు ఆస్తమాను పెట్రేగేలా చేస్తాయి. ముఖ్యంగా కుక్క, పిల్లి, గుర్రం, మేక మొదలైన జంతువుల నుంచి దూరంగా ఉండాలి.
  • తీవ్రమైన శారీరక శ్రమ వలన ఆయాసం పెరిగి ఆస్తమాలోకి దింపుతుంది. శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి లోనవ్వకుండా ఉండాలి. ముఖ్యంగా డిప్రెషన్ కి లోనుకాకూడదు.
  • ఆస్తమా ఎటాక్ తీవ్రంగా ఉన్నప్పుడు ఉపశమనం కోసం అరగంటకొకసారి ఇసుక మూటను కాని, ఇటుక చుట్టిన మూటనుకాని పెనంమీద వేడిచేసి ఛాతిమీద కాపడం పెట్టుకోవాలి. అలాగే వేడినీటి ఆవిరిని పీల్చాలి. నీటి ఆవిరివల్ల శ్లేష్మం పల్చబడి తేలికగా వెలుపలకు వచ్చేస్తుంది.
  • ధూమపానం ఆస్తమాకు ప్రథమ శత్రువు. సిగరెట్ పొగ వల్ల సెన్సిటివిటీ పెరిగి శ్వాస మార్గాలు మూసుకుపోతాయి. ఉబ్బసం బాధితులకు సిగరెట్లు తాగే అలవాటుంటే వెంటనే మానేయాలి.
Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here