Kanuma | కనుమ నాడు ఎందుకు ప్రయాణం చేయకూడదు?

0
163
Kanuma
Kanuma

Why travel is not recommended on Kanuma day?

కనుమ నాడు ఎందుకు ప్రయాణం చేయకూడదు?

  • తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా జరుపుకునే పెద్ద పండగలలో సంక్రాంతి ఒకటి. ఇది మూడు రోజుల పండగ, మొదటి రోజు భోగి, రెండో రోజు మకర సంక్రాంతి, మూడో రోజు కనుమ జరుపుకుంటారు.
  • కనుమ పండగను పశువుల పండగ అని కూడా అంటారు. ఈ రోజున పాడి పశువులను ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేసి, మంచి ఆహారం అందిస్తారు.
  • అలాగే ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులను కట్టి పక్షుల కోసం ఆహారాన్ని అందిస్తారు.

ఎందుకు ప్రయాణాలు చేయరాదు?

  • పశువులకు విశ్రాంతి
    పూర్వ కాలంలో ప్రయాణాలకు ఎడ్ల బండ్లను ఉపయోగించేవారు. కనుమ నాడు ఎడ్లకు కష్టమివ్వకుండా, విశ్రాంతి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఆచారం ఏర్పడింది.
  • నుమ రోజున ప్రయాణాలు తగ్గించి పశువుల పూజకు ప్రాధాన్యం ఇచ్చేవారు.
  • కుటుంబ సమయం
    కనుమ రోజున కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఉండి, పెద్దలను తలచుకుంటూ విందు భోజనం చేయడం ఆచారం.
  • అందుకే ఈ రోజు ప్రయాణాలు మానుకుని ఇంట్లో పండగ వేడుకలు జరుపుకోవాలని పెద్దలు చెప్పేవారు.
  • ఆధ్యాత్మిక పరమార్థం
    కనుమ నాడు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. పెద్దలు ఈ సమయాన్ని దేవతలకు ఇష్టమైన కాలంగా పేర్కొంటారు.
  • చనిపోయిన పెద్దలను తలచి, వారికి ప్రసాదం పెట్టడం సంప్రదాయం. కనుక ఆ రోజు ఆధ్యాత్మిక చింతనకు ప్రాధాన్యత ఇస్తారు.

ప్రయాణం చేస్తే ఏమవుతుంది?

  • పూర్వ కాలంలో పెద్దలు కనుమ రోజున ప్రయాణం వల్ల ఆటంకాలు, సమస్యలు ఎదురవుతాయని నమ్ముతారు. కనుక ఆ రోజు ప్రయాణం వద్దని చెబుతారు.
  • కనుమ పండగ మనిషి జీవితంలో పశు పక్ష్యాదులకు ఉండే ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది.
  • పాడి పశువులకు విశ్రాంతి ఇచ్చి, కుటుంబ సమయాన్ని ఆస్వాదించటానికి ఈ పండగను పెద్దలు రూపొందించారు. కనుక ఈ సంప్రదాయాన్ని పాటించడం మన బాధ్యత.
  • ‘కనుమ నాడు కాకులు కూడా కదలవు’ అనే సామెత ఈ ఆచారం గొప్పతనాన్ని తెలియజేస్తుంది. కనుక కనుమ రోజున ప్రయాణాలు తగ్గించి, పండగ ఆనందాన్ని ఇంట్లోనే జరుపుకోవడం ఉత్తమం.

Related Posts

Gotram | గోత్రమంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత ఏంటి?

Post-death belongings | చనిపోయిన వ్యక్తి వస్తువులు వాడకూడదా?

Kanyadaanam | ఆడపిల్ల ఇంటి వాళ్ళు అల్లుడి కాళ్లను ఎందుకు కడుగుతారు?

Sister’s marriage | హిందూ సంప్రదాయాల ప్రకారం అన్న కంటే చెల్లి పెళ్లి ముందుగా ఎందుకు చేస్తారు?

Betel leaf garland for Hanuman | ఆంజనేయుడికి తమలపాకుల మాల ఎందుకు సమర్పిస్తారు?