Vikunta Dwara Darshanam | జనవరి నెలలో తిరుమల వెళ్లేవారికి అలెర్ట్, వైకుంఠ ద్వార దర్శనం వివరాలు

0
133
vikunta dwara darshanm details
vikunta dwara darshanm details

TTD is making arrangements form vikuntadwara darshan

జనవరి 10 నుండి 19 వరకు తిరుమలలో వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు

జనవరి 10న వైకుంఠ ఏకాదశి కావడంతో, జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలను టీటీడీ అందుబాటులోకి తీసుకురానుంది.

జనవరి నెలలో తిరుమల వెళ్లేవారికి అలెర్ట్:

ఈ పది రోజులు బ్రేక్ దర్శనాలు రద్దు చేయబడనున్నాయి.

ముఖ్యాంశాలు:

  • భక్తులకు ఎక్కువ దర్శన సమయం కల్పించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
    చంటి పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్ఆర్ఐ వారికి జనవరి 10 నుండి 19 వరకు దర్శనాలు రద్దు.
  • జనవరి 9 నుండి 19 వరకు ఆర్జిత సేవలు రద్దు చేయబడతాయి.
    జనవరి 10న స్వర్ణ రథం ఊరేగింపు, జనవరి 11న చక్ర స్నానం ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.
  • ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదం పంపిణీ చేయబడుతుంది.

ఇతర ఏర్పాట్లు:

  • పుష్పాలంకరణలు, వసతి, శ్రీవారి సేవకుల నియామకం, స్కౌట్లు, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం తదితర అంశాలపై కూడా చర్చించారు.

టికెట్ల మరియు ఇతర అంశాలపై మరో రెండు వారాల్లో సమావేశం నిర్వహిస్తారు.

వీఐపీ బ్రేక్ దర్శనాలు:

ఈ పది రోజుల్లో ప్రోటోకాల్ వీఐపీలను మినహాయించి మిగతా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయబడతాయి.

Related posts:

Srisailam wish fulfilling tree | కోరికలు నేరవేర్చే ఈ చెట్టు ఇక్కడి ప్రత్యేకత

Tirumala Sevas Information | తిరుమల శ్రీవారికి నిత్య జరిగే సేవలు మరియు వాటి వివరాలు