Astrology of 2025 | ఇప్పటి నుంచి ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే.

0
284
Astrology for new year
Astrology of new year 2025

Astrology for specific zodiac signs.

2025 సంవత్సరంలో ఈ 6 రాశుల వారికి శుభ ఫలితాలు:

కొత్త సంవత్సరంలో శుక్రుడి అనుకూలత కొన్ని రాశుల వారికి మరింత శుభాన్నిస్తుంది. భోగభాగ్యాలు, సిరిసంపదలు, సుఖ సంతోషాలు, శృంగారం, విలాసాలు, ప్రేమలు, పెళ్లిళ్లకు కారకుడైన శుక్రుడు ఈ డిసెంబర్ మొదటి వారం నుంచి వచ్చే ఏడాది జూలై వరకు కొన్నిరాశుల వారికి అసాధారణంగా శుభ ఫలితాలను ఇస్తాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ముఖ్యంగా జనవరిలో ఉచ్ఛరాశిలో ప్రవేశించనున్న శుక్రుడు శుభఫలితాలకు నాంది పలుకుతాడు. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారికి కుబేర యోగం కలుగుతుందని, వీరి జీవితాలు ఆశ్చర్యకరమైన మార్పులను అనుభవిస్తాయని విశ్లేషకులు అంటున్నారు.

మేషం (Arise)

  • శుక్రుడి అనుకూలతతో ఉన్నత కుటుంబం వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం.
  • ధన ధాన్య సమృద్ధి.
  • సొంత ఇంటి కల నెరవేరే సూచనలు.
  • సానుకూల దృక్పథంతో తీసుకున్న నిర్ణయాలు జీవనోన్నతిని తీసుకువస్తాయి.
  • హోదా, స్థాయి గణనీయంగా పెరుగుతాయి.

వృషభం (Taurus)

  • శుక్రుడు రాశ్యాధిపతిగా ఉండటంతో ఏ ప్రయత్నం చేసినా విజయం.
  • ఆదాయంలో వృద్ధి, కొత్త అవకాశాల ద్వారా విజయాలు.
  • విదేశీ అవకాశాలు, ఉద్యోగ ప్రగతి.
  • వ్యాపారాల్లో లాభదాయక స్థితి.
  • గృహ, వాహన సౌకర్యాలు లభిస్తాయి.

కర్కాటకం (Cancer)

  • శుక్రుడి అనుగ్రహంతో ఆస్తి సమస్యల పరిష్కారం.
  • కొత్త ఉద్యోగ అవకాశాలు మరియు ఆదాయ వృద్ధి.
  • సొంత ఇంటి కల నెరవేరుతుంది.
  • వృత్తి, వ్యాపారాల్లో పట్టిందల్లా బంగారం.
  • ప్రముఖుడిగా గుర్తింపు పొందే అవకాశాలు.

కన్య (Virgo)

  • ధన, భాగ్యాధిపతిగా శుక్రుడు అనేక మార్గాల్లో శుభఫలితాలు అందిస్తాడు.
  • ఆర్థికంగా సిరిసంపదలు పెరుగుతాయి.
  • ఆరోగ్య సమస్యలు లేకుండా ప్రశాంత జీవనం.
  • ఉద్యోగాల్లో ఉన్నత స్థానం మరియు వృత్తి లాభాలు.
  • సంతాన ప్రాప్తి, పెళ్లి ప్రయత్నాల్లో విజయాలు.

తుల (Libra)

  • వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనూహ్య విజయాలు.
  • ఆదాయంలో అగ్రస్థానానికి ఎదగడం.
  • ఒక ప్రముఖుడిగా పేరు ప్రఖ్యాతులు పొందడం.
  • విదేశీ ఉద్యోగ అవకాశాలు.
  • జీవితశైలి పూర్తిగా మారి, ఆశలు నెరవేర్చడం.

మకరం (Capricorn)

  • ఏ రంగంలో ఉన్నా ఊహించని అభివృద్ధి సాధించడం.
  • వృత్తి, వ్యాపారాల్లో అపార ధనలాభాలు.
  • ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు.
  • అధికార యోగం, విదేశీ అవకాశాలు.
  • జీవనోన్నతికి అనుకూల పరిస్థితులు.

కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

Related Posts

Women Bangles | జ్యోతిష్యం ప్రకారం ఏ రాశి మహిళ, ఏ కలర్ గాజులు ధరించాలి?

Shani Gochar 2024 | శని సంచారం కారణంగా వచ్చే 294 రోజులు ఈ రాశుల వారికి చేదువార్తలు!

https://hariome.com/surya-gochar-these-zodiac-signs-will-get-benefits/

https://hariome.com/mahalakshmi-rajyoga-will-shine-these-zodiac-signs/

Luckey Peoples | ఈ తేదీల్లో జన్మించిన వారు అదృష్టవంతులు, వీరికి డబ్బు కొరత ఉండదు.