
August Month Horoscope 2024
1ఆచార్య రాఘవేంద్ర ప్రముఖ రాజకీయ,ఆర్థిక జ్యోతిష నిపుణులు
మేష రాశి (Aries):
విద్యా: ఈ నెలలో మీ విద్యా కార్యాచరణలో మంచి పురోగతి ఉంటుంది. కష్టానికి తగ్గ ఫలితాలు సాదించే అవకాశం. మీరు కొత్త సాహిత్యం వైపు ఆసక్తి కనపరచే అవకాశం ఉంది,మరియు కృషి ద్వారా ముందుకు సాగాలనే మీ సంకల్పం సిద్ధిస్తుంది.
వృత్తి: వృత్తి రంగంలో కొత్త అవకాశాలు దొరుకుతాయి. మీ ప్రతిభను చూపించేందుకు మంచి సమయం.మంచి క్రమ శిక్షణ తో ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు.ఆత్మవిశ్వాసం చేసే పనుల వలన విజయాలను సాధిస్తారు.
వివాహం: వైవాహిక బంధం లో సానుకూల మార్పులు కనిపిస్తాయి. మీ భాగస్వామితో అర్థవంతమైన సంభాషణలు సాగిస్తారు.
ఆరోగ్యం: ఆరోగ్యం సాధారణం గా ఉంటుంది,నిద్ర మరియు ఆహారం పై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని మీరు గమనిస్తారు.ఒత్తిడిని తగ్గించేందుకు యోగ,లేదా మెడిటేషన్ చేయండి.
వ్యాపారం: వ్యాపారంలో మంచి లాభాలు సాధ్యమవుతాయి,కొత్త ఆలోచనలను అమలుచేసేందుకు ఇది సరైన సమయం గా మీరు భావిస్తారు.
సంతానం: సంతానానికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. పిల్లల భవిష్యత్తుకి సంభందించిన కార్యాచరణ పట్ల శ్రద్ధ వహిస్తారు.
పరిహారాలు:
1. శ్రీకృష్ణుడికి పళ్లతో పూజ చేయండి
2. ఈ మేష రాశి వారు ప్రతిరోజూ సూర్య దేవుడికి నైవేద్యం సమర్పించడం మంచిది.
వృషభ రాశి (Taurus):
విద్యా: విద్యా రంగంలో కొన్ని సవాళ్లు ఎదురవవచ్చు. పట్టుదల మరియు నిబద్ధతతో ముందుకు సాగడం అవసరం.
వృత్తి: వృత్తి విషయంలో నెమ్మదిగా ముందుకు వెళ్లడం మంచిదని మీరు గ్రహిస్తారు,మీ అభివృద్ధి స్థిరంగా వృద్ధి చెందుతుంది. మీప్రయత్నాన్ని తగ్గించకుండా కొనసాగండి.
వివాహం: వివాహ జీవితం సంతోషకరంగా ఉంటుంది. మీ భాగస్వామితో సానుకూల సంబంధాలు నిలుపుకోవడం లో మీరు సఫలీకృతులవుతారు.
ఆరోగ్యం: ఆరోగ్యంగా ఉండటానికి మీ ఆహారపరమైన అలవాట్లు మార్చడం అవసరం.ఉదర సంభందిత సమస్యలకి ఆస్కారముంది.
వ్యాపారం: వ్యాపారంలో మోస్తరు లాభాలు సాధ్యం. మీ భవిష్యత్ అంచనాలను అందుకోవడానికి మరికొంత సమయం అవసరమని మీరు తెలుసుకుంటారు.
సంతానం: సంతానానికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. పిల్లల విద్యపై శ్రద్ధ పెట్టండి.
పరిహారాలు:
1. శివలింగానికి పాలాభిషేకం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది.
2. వృషభ రాశి వారికి ప్రతి రోజు శివపూజ చేయడం మంచిది.
మిథున రాశి (Gemini):
విద్యా: ఈ నెలలో విద్యా రంగంలో మీరు మంచి ఫలితాలు పొందవచ్చును. కొత్త విషయాలను నేర్చుకోవడం సులభం గా మారుతుంది.
వృత్తి: వృత్తి సంబంధిత రంగంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీ సామర్ధ్యాన్ని ప్రదర్శించడానికి ఇది సరియైన సమయం గా మీరు భావిస్తారు.
వివాహం: వైవాహిక బంధాల్లో ఆనందకర సమయాన్ని గడుపుతారు.
గతంలో ఏర్పడిన అపోహలు తొలగిపోతాయి.
ఆరోగ్యం: స్వల్ప ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు,ఒత్తిడిని తగ్గించేందుకు వ్యాయామం మరియు శ్రద్ధ అవసరం.
వ్యాపారం: వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. కొత్త ఆలోచనలతో ముందుకు సాగవచ్చు.
సంతానం: సంతానానికి సంబంధించి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. పిల్లల అభివృద్ధిపై దృష్టి సారిస్తారు
పరిహారాలు:
1. పార్వతీ దేవికి కుంకుమార్చన చేయించడం వలన శుభ ఫలితాలుంటాయి
2. మిథున రాశి వారు ప్రతిరోజూ విష్ణు మంత్రాన్ని జపించడం మంచిది.
మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.