
Lord Venkateswara Swamy Worship
1శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించి అష్టైశ్వర్యాలు పొందండి.
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి, భక్తులను కష్టాల నుండి రక్షించడానికి కలియుగంలో అవతరించిన సాక్షాత్తు నారాయణుడు. శనివారం వారికి ప్రీతికరమైన రోజు. ఆ రోజు స్వామికి పూజలు చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
శనివారం పూజా విధానం:
- ఉదయాన్నే స్నానం చేసి, తిరునామా ధరించండి.
- పూజా గదిని శుభ్రం చేసి, వేంకటేశ్వర స్వామి ప్రతిమ/విగ్రహం/ఫోటోను ఉంచండి.
- దీపాలను శుభ్రం చేసి, పువ్వులతో స్వామివారిని అలంకరించండి.
- పూజాగది, ఇంటి ముందు రంగవల్లికలు వేయండి.
- తులసి దళాలతో స్వామిని అర్చించండి.
- ధూపదీపనైవేద్యాలు సమర్పించండి (పాలు, పండ్లు, పాయసం, కలకండ, చక్కెర పొంగలి, పులిహోర).
- శ్రీ వేంకటేశ్వరస్వామి మహాత్మ్యం చదవండి.
- “ఓం నమో నారాయణా” మంత్రాన్ని జపించండి.
- సాయంత్రం కూడా ధూపదీపాలతో పూజించండి.
- బియ్యం పిండితో ప్రమిదలో దీపం వెలిగించి, చక్కెర పొంగలి, గారెలు నైవేద్యంగా సమర్పించండి.
- కర్పూర హారతి ఇవ్వండి.
- ఒంటి పూట భోజనం చేయండి.
- సాయంత్రం దీపారాధన చేసి, స్వామి నామాలను పారాయణం చేయండి.
- ఆరోగ్యం అనుమతిస్తే నేలపై పడుకోండి.
- శనివారం మాంసహారం, మద్యం మానుకోండి.
నియమాల పాటింపు ఫలితాలు:
- స్వామి అనుగ్రహం కలుగుతుంది.
- అష్టైశ్వర్యాలు లభిస్తాయి.
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
Related Posts
Lord Venkateswara Swamy Vratha | కష్టాల తీర్చే శ్రీ వేంకటేశ్వరస్వామి వ్రతం & గోవింద నామాల మహిమ.
Shiva Pooja Vidhanam | విష్ణుమూర్తి తానే స్వయంగా చెప్పిన శివ పూజావిధానం.
Lord Shiva Worship | ఉద్యోగ ప్రాప్తి మరియు సిరి సంపదల కొరకు శివుడిని ఈ విధంగా పూజించండి.
Durga Devi | దుర్గాదేవి నుండి ప్రతి ఒక్క స్త్రీ నేర్చుకోవలసిన విషయాలు.
Lord Shiva Worship | శివయ్య దర్శన సమయంలో ఈ నియమాలు తప్పకుండా పాటించాలి.
ప్రతి హిందువు తమ జీవిత కాలంలో నిత్యం పఠించవలసిన నామాలు?! | Compulsory Chanting Stotras by Everyone