
Lord Shiva Worship On Monday
1శివునికి ప్రీతికరమైన సోమవారం.
సోమవారం శివుని ఆరాధనకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజు శివునికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల అనేక శుభఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అవేంటో మనం ఇక్కడ తెలుసుకుందాం.
సోమవారం శివుడికి ఇష్టమైన కొన్ని పనులు:
తల స్నానం చేసి నుదుట విభూతి ధారణ: శివునికి విభూతి ఎంతో ఇష్టం. సోమవారం తల స్నానం చేసి నుదుట విభూతి ధరించడం వల్ల శివ కటాక్షం లభిస్తుంది.
లింగాభిషేకం: సోమవారం శివునికి లింగాభిషేకం చేయడం ఎంతో మంచిది. కైలాసంలో శివుడికి అభిషేకం చేసినదానితో సమానం లింగాభిషేకం.
ఓం నమః శివాయ జపం: సోమవారం ఓం నమః శివాయ అని జపించడం వల్ల శివుడి అనుగ్రహం కలుగుతుంది.
శివాలయ సందర్శన: సోమవారం శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకోవడం ఎంతో మంచిది. కుదరనివారు ఇంట్లో నమః శివాయ అని 108 సార్లు జపించాలి.
బిల్వ పత్రార్చన: సోమవారం శివుడికి బిల్వ పత్రాలతో అర్చన చేస్తే కోటి జన్మల పుణ్యంతో పాటు జన్మ జన్మల పాప నాశనం.
శివపార్వతీ పూజ: సోమవారం శివుడితో పాటు అమ్మవారిని కూడా కలిపి పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి.
శివాభిషేకం: సోమవారం మూడు కాలాలలో శివాభిషేకం చేస్తే దేవతలు ఆ ఇంట చేరి ఆ అభిషేకాన్ని దర్శిస్తారు.
సోమవారం శివ పూజ చేసేవారికి కొన్ని నియమాలు:
1. మాంసాహారం, మద్యపానం, ఉల్లిపాయలు పూర్తిగా నిషిద్ధం.
2. నిత్యం శివ నామ స్మరణతో గడిపేవారికి గ్రహ దోషాలు తొలగిపోతాయి.
3. సోమవారం శివుని ఆరాధన చేయడం వల్ల మనకు శుభం కలుగుతుంది. ఈ రోజు శివునికి ప్రీతికరమైన పనులు చేసి ఆయన అనుగ్రహాన్ని పొందాలని కోరుకుందాం.
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
Related Stories
Shani Dev Secrets | శనిదేవుడి ఈ ఐదు రహస్యాల గురించి తెలుసుకోండి.
Sheetala Saptami 2025 | శీతల సప్తమి తేదీ & ముహూర్తం, ఆచారాలు, వ్రత కథ, పూజా విధానం
Lemon Lamp | నిమ్మకాయల దీపం వెలిగించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు
Sheetala Ashtami 2025 | శీతల అష్టమి 2025 తేదీ & ముహూర్తం, ఆచారాలు, వ్రత కథ, పూజా విధానం
Homam Types | ఏ హోమం చేసుకుంటే ఏ ఫలితం దక్కుతుంది & హోమం చేసుకుంటే కలిగే ప్రయోజనాలు.
Bhishma Ashtami Tharpanam Slokam – భీష్మ అష్టమి తర్పణ శ్లోకం