ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడ కొత్తగా నిర్మించారో తెలుసా?! | BAPS Shri Swaminarayan Mandir, Robbinsville, New Jersey

0
145
Biggest Hindu temple in America
Full Details of BAPS Shri Swaminarayan Mandir

Swaminarayan Akshardham (New Jersey)

1BAPS స్వామినారాయణ్ అక్షర్‌ధామ్‌

ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం! అమెరికా దేశంలో..?!

మన హిందూ సనాతన ధర్మం ఎంత గొప్పదంటే పాశ్చత్య దేశాలు కూడా ఆచరించెంత గొప్పది. మన భారతదేశంలో ఉన్న నాస్తికులు మన సనాతన ధర్మం గురించి హేళన చేస్తుంటే, మన దేశం నుండి ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడిన వారు మాత్రం మన సనాతన ధర్మం గురించి విస్తరిస్తున్నారు. మన హిందూ సనాతన ధర్మం ఆచరించే కేరళ కి సంబంధించిన దంపతులు అమెరికా కి వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. ఆ దంపతుల కుమారుడు వివేక్ రామస్వామి గారు ఇప్పుడు అగ్ర స్థానంలో ఉన్న అమెరికా దేశానికి అధ్యక్ష పదవి కి పోటిలో ఉన్నారు. అక్కడ ఉన్న మన దేశం హిందువులు అందరూ కలిసి చాలా గొప్ప దేవాలయాన్ని నిర్మించారు. అక్కడ దైవ మందిరాల నిర్మించడం 150 ఏళ్ల కిందటే మొదలైంది. అందులో బీఏపీఎస్‌ స్వామినారాయణ్‌ అక్షర్‌ధామ్‌ ఒక్కటీ. అయితే 183 ఎకరాల విస్తీర్ణంలో 255 అడుగుల ఎత్తులో నిర్మించడం జరిగింది. ఈ క్షేత్రాన్ని ఇప్పటికే వేలాదిమంది దర్శించుకుంటున్నారు. ఆ దేవాలయం గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం.

BAPS Shri Swaminarayan Mandir, Robbinsville

1. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం భాఫ్శ్ స్వామినారాయణ్‌ అక్షర్‌ధామ్‌. ఇది నార్త్ అమెరికా న్యూజెర్సీ రాష్ట్రం, రాబిన్స్‌విల్లె పట్టణంలో నిర్మాణం జరిగింది.
2. ఈ ఆలయాన్ని యొక్క విశిష్టత ఏమిటంటే పూర్తిగా చేతితోనే ఈ దేవాలయాన్ని చెక్కడం జరిగింది.
3. ఈ ఆలయాన్ని అక్టోబర్ 8న ప్రారంభించారు. ఈ ఆలయాన్ని 19వ శతాబ్దపు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు భగవాన్ స్వామి నారాయణ్ కు అంకితం ఇచ్చారు.
4. భగవాన్ స్వామి నారాయణ్ తర్వాత 5వ తరం వారి వారసుడు, ప్రముఖ సాధువు ప్రముఖ్ స్వామి మహారాజ్ ఈ ఆలయ నిర్మాణానికి ఆద్యం పొసాడు.
5. 12,500 మందికి పైగా ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్నారు.
6. మన భారతీయ శిల్ప కళ, సంస్కృతి మరియు ఆధ్యాత్మిక సంపదలను గుర్తుచేసేలా ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు.
7. దాదాపు 12 సంవత్సరాలుగా ఈ ఆలయ నిర్మాణం కొనసాగింది. ఈ ఆలయ మొత్తం 183 ఎకరాల ప్రాంగణం సువిశాల స్థలంలో ఉంటుంది.
8. ఆలయ నిర్మాణంలో 10 వేల విగ్రహాలు, ప్రతిమలు చెక్కారు. ఈ ఆలయ నిర్మాణం కోసం ప్రధానంగా లైమ్ స్టోన్, పింక్ శాండ్ స్టోన్, మార్బుల్, గ్రానైట్ బండలను ఉపయోగించడం జరిగింది.
9. 10,000 పైగా మన హిందూ దైవ ప్రతిమలు ఈ ఆలయంలో కొలువుదీరాయి.
10. ఈ ఆలయ ప్రధాన గర్భగుడిలో 12 ఉపాలయాలు, 9 శిఖరాలతో పాటు భారీ గుమ్మటాన్ని ఈ అక్షర్ ధామ్ లో మనం చూడవచ్చు.
11. ఈ ఆలయ 1000 సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా ఉండేలా రూపొందించడం జరిగింది.
12. ఈ ఆలయంలో బ్రహ్మకుండ్‌ అనే పేరుతో సంప్రదాయకంగా ఒక బావిని ఏర్పాటు చేశారు.
13. ఈ బావిలో భారత్ లోని పవిత్ర నదులు, అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలతో సహా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 300 కంటే ఎక్కువ నదుల నుంచి సేకరించిన పవిత్ర జలాలతో నింపారు.
14. ఈ ఆలయాన్ని అమెరికాలోని హిందువులతో పాటు స్థానికులు మరియు ఇతర మతాలకు చెందిన ప్రముఖులు కూడా సందర్శించేందుకు తరలివస్తున్నారు.

Spiritual Related Posts

సియారియా ధామ్ కుంభమేళా స్నానం! విదేశీ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు! | Simaria Dham Kumbh Mela 2023

శ్రీ వెంకటేశ్వర స్వామి మొట్టమొదటగా వెలసింది తిరుమల కాదా? మరీ ఎక్కడో తెలుసా?! | Where Sri Venkateswara Swamy Appeared First?

దక్షిణ కాశీ వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో తిరుమలలాగా ఆ సేవలు ప్రారంభం| Vemulawada Temple Updates

మీరు ఏళ్ళనాటి శనితో బాధపడుతున్నారా? అయితే ఈ దేవాలయాలను దర్శించుకుంటే చాలు | Famous Lord Shani Temples

శ్రీ మహాలక్ష్మీ కటక్షంతో ఈ రాశుల వారికి మహర్దశ | Mahalakshmi Special Blessings on These Zodiac Signs

తిరుమలలో నవంబర్ నెలలో జరుగనున్న ఉత్సవాలు & విశేష పర్వదినాలు | Tirumala Important Festivities in November 2023

కాణిపాకం ఆలయ ప్రత్యేకతలు, విశిష్ఠత, దర్శనీయ దేవాలయాలు, ఆలయానికి ఎలా చేరుకోవాలి? | Kanipakam Temple Significance, Around Temples, How to Reach?

కాణిపాకం ఆలయ సమయాలు, సేవలు, దర్శనాలు, టికేట్స్ ధరలు | Kanipakam Temple Timings, Sevas, Darshan, Ticket Prices

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం | Kanipakam Temple History, Seva, Darshan & Timings

తిరుమల శ్రీవారికి ఎన్ని రకాల ప్రసాదాలు నివేదిస్తారో తెలుసా? | ఏ రోజు ఏ ప్రసాదం?, వాటిని స్వీకరిస్తే కలిగే ఫలితాలు?! | Types of Prasads Offering to Sri Venkateshwara Swamy

తులసి మొక్కను ఈ రోజుల్లో తాకడం వలన లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. | Tulasi Puja Rules