
Features of Kanipakam Temple
1కాణిపాకం ఆలయ విశేషాలు
1. ఆ బావి నీరు ఎప్పటికీ ఎండిపోదు.
2. బావి నీటిని భక్తులకు తీర్థంగా పరమ పవిత్రంగా భావించి ఇస్తారు.
3. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా 104 సీసీ కెమెరాల పర్యవేక్షణలో కాణిపాకం వినాయక గుడికి రక్షణ కల్పించారు అధికారులు.
4. వినాయక చవితి నాడు పుష్పాలు, పండ్లతో అలయాన్ని అలంకరిస్తారు.
5. 50 ఏళ్ల క్రితం బహుకరించిన వెండికవచం, భక్తులు ఇచ్చిన తొడుగులు 2000, 2002, 2006, 2007 స్వామికి ఇప్పుడు సరిపోక పోవడం వినాయక విగ్రహం వృద్ధికి నిదర్శనంగా చెబుతారు.
6. ఇక్కడ స్వామి వారు కొద్దిగా నీటిలో మునిగి ఉండి స్వయంభూగా వెలిశారు. ఎంత లోతుగా త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుక్కోలేకపోయారు. ఇక్కడి వినాయకడి మూలవిరాట్ పరిమాణం పెరుగుతూ ఉంటుంది.
7. నిత్యం స్వామి వారికి అష్టోత్తర పూజలు చేస్తారు.
8. కాణిపాకం స్వామివారి గుడి ఈశాన్య దిశలో వరదరాజ స్వామి ఆలయం ఉంది.
9. కాణి = చిత్తడి నేల, పాకం అంటే నీరు ప్రవహించడం అనే అర్థం వస్తుంది.
10. ఈ దేవలయంలో ఎల్లప్పుడూ ఒక పాము తిరుగుతూ ఉంటుంది. కానీ అది ఎవరికీ హాని చేసిన సంధర్భాలు ఏమి లేవు అంటే అది ఆ గణేషుని మహిమ అని భక్తుల నమ్మకం.
11. సత్యానికి మారుపేరుగా కాణిపాక వినాయకుడికి పేరు. అందుకే అక్కడ ఏదైనా తప్పు చేసిన వ్యక్తిని ఆలయం ముందున్న కోనేటి నీటిలో స్నానం చేపించి ప్రమాణం చేపిస్తే తప్పు ఒప్పుకొంటాడు అని ప్రసిద్ధి.
12. ఇక్కడ ఇష్టమైన వాటిని వదిలేస్తే మనం కోరుకున్నది స్వామి వారు తీరుస్తారని భక్తుల నమ్మకం.
13. దురలవాట్లు ఉన్నవాళ్ళతో ఇక్కడ ప్రమాణం చేపిస్తారు ఎందుకంటే స్వామిపై ఉన్న భయంతోనైన చెడు అలవాట్లు మానుతారు అని.
కాణిపాకంలో దర్శనీయ దేవాలయాలు / ప్రదేశాలు (List of Must Visit Temples / Places in Kanipakam)
1. ఆలయానికి వాయవ్య దిశలో మరకతంభికా సమేత శ్రీ మణికంటేశ్వర ఆలయం.
2. షణ్ముఖ, దుర్గ ఆలయాలు
3. శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయం.
4. ప్రసిద్దమైన ఆంజనేయస్వామి గుడి.
5. అద్దాల మేడ.
6. వరదరాజస్వామి ఆలయంలో నవగ్రహాల మండపం.
7. శివాలయం, వరదరాజ స్వామి ఆలయాలు.
కాణిపాకం ఆలయానికి ఎలా చేరుకోవాలి? (How to Reach Kanipakam Temple?)
బస్సు సౌకర్యములు (Bus Fecility):
తిరుపతి నుండి 15 నిమిషాలకోక బస్సు కలదు. చిత్తూరు పట్టణం నుండి ప్రతి 10 నిముషాలకు ఒక బస్సు కలదు. చంద్రగిరి నుండి జీపులు, వ్యానులు, ట్యాక్సీలు మొదలైన ప్రైవేట్ వాహనాలు లభించును.
రైలు సౌకర్యములు (Train Fecility):
ఆంధ్రప్రదేశ్ ఏమూల నుండి అయిననూ చిత్తూరుకు లేదా రేణిగుంట లేదా గూడూరు పట్టణాలకు రైళ్ళు ఉన్నాయి. ఈ ప్రదేశాల నుండి బస్సు ద్వారా సులభముగా కాణిపాకం చేరవచ్చు.
విమానయానం (Near By Airport)
రేణిగుంట విమానాశ్రయం కూడా కలదు. ఇక్కడి నుంచి పైన చెప్పిన విధంగా బస్సు లేదా ప్రైవేట్ వాహనాల ద్వార కాణిపాకం దేవాలయానికి చేరుకోవచ్చు.
Spiritual Related Posts
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం | Kanipakam Temple History, Seva, Darshan & Timings
తులసి మొక్కను ఈ రోజుల్లో తాకడం వలన లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. | Tulasi Puja Rules
ఆయుధ పూజను ఎందుకు & ఎలా చేస్తారు? ఇలా చేస్తే అన్నింటా విజయాలే?! | Ayudha Pooja Rituals
https://hariome.com/srisailam-temple-durga-navratri-dasara-celebrations/