వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు పఠించాల్సిన మంత్రం, ఈవిధంగా చేస్తే 100% పూజాఫలం దక్కుతుంది! | Ganesh Nimajjanam Rules

0
2197
Rules and Regulations of Ganesh Immersion Process
Know the Ganesh Nimajjanam Rules in Outside Water & at Home?!

Rules and Regulations of Ganesh Immersion Process

1గణపతి విగ్రహాన్ని నిమర్జనం చేసే నియమాలు

గణేష్ నిమజ్జనం ఈ విధంగా చేస్తే మంచి పూజాఫలం దక్కుతుంది.

భాద్రపద మాసంలో వినాయక చతుర్థి నాడు ప్రతిష్టాపన చేసుకున్న విఘ్నేశ్వరుడు ప్రతిరోజూ ధూపదీప నైవేద్యాలను అందుకుంటాడు. గణపతి 3 లేదా 5 లేదా 9, 11 రోజులు భక్తులకు వీలైన విధంగా పూజలు అందుకుటారు. భక్తులు అందరూ బేసి సంఖ్యలో మాత్రమే గణేషున్ని నిమజ్జనం చేస్తారు. గణపతి నిమజ్జనం చేసే రోజు వరకు ఉదయం మరియు సాయంత్రం రెండు పూటలా పూజలు అందుకుంటాడు. భక్తులు అందరూ తీర్థ ప్రసాదం స్వీకరిస్తారు. ‘యధాస్థానం ప్రవేశయామి.. పూజార్థం పునరాగమనాయచ’ అనే మంత్రాన్ని పారాయణం చేస్తూ గణేష్ విగ్రహాన్ని ఉద్వాసన పలకాలి. ఆ మంత్రం యొక్క అర్థం స్వామినీ స్వస్థలానికి వెళ్లి మళ్లీ పూజకి మమ్మల్ని అనుగ్రహించు అని. ఆ మంత్రం పారాయణం చేసిన తరువాత పూవు పత్రిలోని ఐదు ఆకులను తీసుకుని వాటికి పసుపు పూసి వాటిని దారంతో చేతికి కట్టుకోవాలి. తర్వాత గణేష్ నిమజ్జనానికి చేయడానికి భక్తులు తయారుగా ఉండాలి. మీ ఇంటి సమీపంలో గల కాలువ లేదా చెరువులో నిమజ్జనం చేసుకోవచ్చు. అవేమి లెకపొతే ఇంటి వద్దనే గణేష్ నిమజ్జనం ఎలా చేసుకోవాలో చూద్దాం.

గణేష్ నిమజ్జనం చేసే విధానం (Method of Ganesh Immersion):

మీ ఇంట్లో గణేష్ నిమజ్జనం చేయలనుకునేవారు శుభ్రంగా ఉన్న బకెట్‌ లేదా టబ్బును మాత్రమే తీసుకోవాలి. వాటిని తోట్టిలా తయారు చెసుకొవాలి. దాని కింద ముందు ముగ్గు వేసి, పసుపు, కుంకుమ పూలు మరియు అక్షింతలు చల్లి దానికి నమస్కారం చేసుకోవాలి. తరువాత వినాయక విగ్రహాన్ని ఆ నీటిలో మెల్లగా నిమజ్జనం చేయాలి. మీ దగ్గర పవిత్ర జలం లేదా గంగా జలం లేదా ఎదైనా నది జలం ఉంటే వాటిని కూడా ఈ నీటిలో కలిపి కూడా నిమజ్జనం చేసుకోవచ్చు. గణేశుని నిమజ్జనం చేసే సమయంలో దీపాలు వెలుగుతూ ఉండాలి. దీపం కొండెక్కిన సమయంలో గణేశుని నిమజ్జనం చేయకూడదు. నదిలో లేదా చెరువులో లేదా ఇంట్లో గణేశుని నిమజ్జనం చేసే సమయంలో ‘‘ శ్రీ గణేశం ఉద్వాసయామి.. శోభనార్థం పునరాగమనాయచ’’ అనే ఈ మంత్రం పారాయణం చేసుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో బకెట్‌ లేదా తొట్టెలో నిమజ్జనం చేసినట్లైతే ఆ నీటిని ఏదైనా మారేడు లేదా రావి చెట్టుకు పోయాలి. గణేష్ వద్ద ఉంచిన పత్రిలు మీ ఇంటి ఆవరణలో చిన్న గొయ్యి తీసి, దానికి పూజ చేస్తే సరిపోతుంది. గణేశుని నిమజ్జనం చేసేటప్పుడు విసిరి వేయకూడదు. రెండు చేతులతో పట్టుకుని చాలా జాగ్రత్తగా గణేశుని నిమజ్జనం చేయాలి.

ఒకవేళ పసుపు గణపతిని చేసినవారు. ఆ గణపతిని ఏదైనా చెట్టు మొదట్లో పెట్టాలి. అలా అని తులసి చెట్టు మొదట్లో అస్సలు పెట్టకూడదు. దానికి కారణం గణపతికి, తులసీకి వైరం ఉంది. సాధారణ సమయంలో తులసి ఆకులతో గణపతిని ఎట్ టిపరిస్థితుల్లో పూజించకూడదు. కేవలం వినాయక చవితినాడు మాత్రమే పూజలో వాడాలి అని పండితులు చెబుతున్నారు.

Related Posts

నిత్య దరిద్రాలకు కారణాలు, వాటికి నివారణలు ఇవే!? | Causes of Eternal Poverty

వినాయకుడిని నిమజ్జనం ఎందుకు చేస్తారు? విశిష్టత & విశేషం ఏమిటంటే?! | Why Lord Ganesha Idol is Immersed in Water

Balarama Jayanti | శ్రీ బలరామ జయంతి, గమ్మత్తైన జననం, విశిష్ఠత, ఎలా జరుపుకోవాలి?!

ఇవే జీవితంలో మంచి శకునాలు! మీకు కనిపిస్తే అదృష్టం మీ వెంటే! | Good Luck Signs

దేవుళ్ళకు ఇలాంటివి నైవేద్యంగా పెడితే దేనికి కూడా లోటు ఉండదు!? | Gods & Prasadam

సంతాన ప్రాప్తి కలగాలంటే బహుళ చతుర్థి వ్రతాన్ని చేయాలి!? | Bahula Chaturthi Vrat & Significance

శ్రీ వేంకటేశ్వర స్వామిని ఏ వారం దర్శించుకుంటే ఎలాంటి ఫలితాలుంటాయి?! | What Are The Results of Done the Lord Venkateshwara Swamy Darshan On Individual Day?!

శ్రీ వేంకటేశ్వర స్వామికి శనివారం అంటే ఎందుకు ప్రీతికరం?! Why Sri Venkateswara Swamy Likes Puja on Saturday?

దుర్గాష్టమి వ్రతం 2023 తేదీ, పూజా విధానం & విశిష్టత ఏమిటి?! | Durgashtami Vrat 2023

Masik Durgashtami Vrat 2025 Dates | మాస దుర్గాష్టమి ప్రతి నెల ఎందుకు వస్తుంది? విశిష్టత & పూజ విధానం ఏమిటి?!

తిన్నప్లేట్ లో చేతిని కడుగవచ్చా!? | Why Shouldn’t We Wash Hands in Plate?