
Good Marriage Muhurtas Dates in 2023
1మే, జూన్ నెలలో పెళ్లి ముహూర్తాలు
వేసవి కాలం అంటేనే పెళ్ళీళ్ళ సీసన్ అంటారు. ఈ సంవత్సరం కూడ మే, జూన్ నెలల్లో పెళ్ళి భాజాలతో పల్లెల్లు, పట్టణాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. పెళ్ళి కావలంటే అమ్మాయి, అబ్బాయి, కుటుంబ సభ్యులు మరియు తెలిసిన వారు ఎంత ప్రత్యేకమో సరైన ముహుర్తం అంతకంటే ముఖ్యం. అందుకే మంచి రోజులు, ఘడియల కోసం పెద్దలు ఎదురుచూస్తూ మంచి ముహూర్తాలు రాగానే పెళ్ళి చేస్తారు. కొంత కాలంగా మంచి ముహుర్తాలు లేకపోవడం వలన ముహుర్తాల కోసం ఎదురుచూస్తు ఉన్నారు. కాని ఇప్పుదు శుభ ముహుర్తాలు మొదలవడంతో పెళ్ళి కావలసిన అన్ని పనులు చక చక చేసుకుంటున్నారు. పెళ్ళిళ్ళ వల్ల 30కి పైగా రంగాలకు చెందిన వేలాది మందికి ఉపాది కూడ లభిస్తుంది.
ఈ సంవత్సరం జూన్ 14వ తేదీ నుంచి ఆగస్టు 18వ తేదీ వరకు శుక్ర మూఢమి ఉండటం వల్ల పెళ్లిళ్లకు శుభముహూర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. ఈ కారణంతో అందరు మే నెలలో మొదటి వారం నుంచి జూన్ 14వ తేదీ వరకు శుభ ముహూర్తాలు ఉండటంతో పెళ్లిళ్లు భారీ సంఖ్యలో జరుపుకొవడానికి ఆసక్తి చుపుతున్నారు.