
First Lunar Eclipse 2023
1మొదటి చంద్రగ్రహణం 2023
2023వ సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు ఏర్పడుతున్నాయి. ఇందులో రెండు సూర్యగ్రహణాలు కాగా, రెండు చంద్రగ్రహణాలు. ఏప్రిల్ 20న తొలి సూర్యగ్రహణం సంభవించింది, కాని ఇది భారతదేశం పై ప్రభావం చూపలేదు. ఈ సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం మే 5, 2023 రానున్నది. రాత్రి 8:45 గంటలకు తొలి చంద్రగ్రహణం ప్రారంభం కానుంది మరుసటి రోజు మే 6,2023 అర్ధరాత్రి 1:00 గంటలకు ముగుస్తుంది.
వైశాఖ మాసం పౌర్ణమి రోజున తొలి చంద్రగ్రహణం సంభవించబోతున్నది. సాధారణంగా సూర్యునికి మరియు చంద్రుడికి మధ్య భూమి వచ్చినప్పుడు, సూర్యుడు కిరణాలు చంద్రుడిపై పడకుండా భూమి అడ్డుపడటాన్ని చంద్రగ్రహణం అంటారు. చంద్ర గ్రహణానికి ముందు సూతక కాలం ఏర్పడుతుంది. జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం సూతక కాలం అశుభ కాలంగా భావిస్తారు. కాని మే 5న సంభవించే తొలి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు మరియు దాని ప్రభావం ఉండదు. దాని మూలంగా సూతకం కాలం కూడా ఉండదు.