సింహాద్రి అప్పన్న నిజరూపదర్శనంపై చర్యలు | Simhadri Chandanotsavam Issue

0
269
AP Government Serious on Simhachalam Officers
Andhra Pradesh Government Serious on Simhachalam Officers

AP Government Serious on Simhachalam Officers

1సింహాద్రి అప్పన్న నిజరూపదర్శనంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో సింహాచలం నరసిమ్హ స్వమ్య్ దేవాలయం ఒకటి. నిత్యం వేలాది మంది భక్తులు దర్శనం కోసం వస్తారు. చందనోత్సవం రోజు ఐతే చెప్పనవసరం లేదు ఊహించని రీతిలో భారీగా భక్తులు వస్తారు. ఇక ఈ సంవత్సరం ఇసుక వేస్తే రాలనంతంగా భక్తులు వచ్చారు. కానీ రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడంలో ఆలయ అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. ఎంతలా అంటే ఏపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు మద్దతుగా ఉండే విశాఖ శారదా పీటం “స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి” గారు సైతం తీవ్ర స్థాయిలో మండిమడ్డారు.

ఈ వివాదం ముగియకముందే సింహాచలం చందనోత్సవంలో మరో అపచారం జరిగింది. అదే గుర్తు తెలియని భక్తులు సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనంలో ఉన్న స్వామివారి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఓ వైపు ఉత్సవం జరుగుతుండగానే బయటకు ఫొటోలు, వీడియోలు వచ్చాయి. అది కూడా స్వామివారి గర్బాలయంలో ఫొటోలు, వీడియోలపై నిషేధం ఉన్నా కూడా బయటకు ఎలా వచ్చాయన్నదే ఇప్పుడు కలకలం రేపుతోంది. గతేడాది మొదటిసారిగా బయటకు వచ్చాయి. ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఫొటోలు, వీడియోలు బయటకురావడంపై భక్తులు మండిపడుతున్నారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న సింహాచలం అప్పన్న దేవాలయంలో ఇలాంటి అపచారాలు జరగడం, అధికారుల వైఫల్యాలపై ప్రభుత్వం కూడ సీరియస్‌ అయ్యింది.

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు

జాయింట్ కలెక్టర్ విశ్వనాథ్ సింహాచలంలో విచారణ చేపట్టారు. దేవస్ధానంలోని సీసీఫుటేజ్, ఇతర ఆధారాలను పరిశీలించారు. ఈ సందర్బంలో చందనోత్సవం టిక్కెట్లు కూడ భారీగా రీసైక్లింగ్ జరిగినట్టు కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ పనులు ఎవరు చేశారు అనే దిశగా బాధ్యులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. అంతరాలయం వీడియోలు రికార్డింగ్, బయటకు రావడంపై దృష్టిసారించిన అధికారులు బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Related Posts

సింహాచలం అప్పన్న చందనోత్సవంలో వీటి వల్ల ఇబ్బందులు పడిన భక్తులు

టీటీడీ పేరుతో మరో నకిలీ వెబ్‌సైట్, ఇదే అధికారిక వెబ్‌సైట్ | TTD Official Website vs Fake Websites

శ్రీవారి భక్తులకు తిరుమల కొండపై మరో ఉచితం | TTD Another Free Seva to Devotees

తిరుమలలో ఇవి మాయం!! టిటిడి అధికారుల స్పందన!!

విజయవాడ దుర్గమ్మ గుడిలో ఇవి రంగులు మారుతున్నాయి? ఇది దేనికి సంకేతం?!

2023లో గంగా పుష్కరాలు పూర్తి వివరాలు | Ganga Pushkaralu 2023 | పుష్కరాలలో చెయ్యవలసిన విధులు

తిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes

శ్రీవారి భక్తుల కోసం టిటిడి కొత్తగా తీసుకున్న కీలక నిర్ణయాలు

తిరుమల శ్రీవారి భక్తులకు రెండు శుభవార్తలు..లడ్డుతో పాటు మరో ప్రసాదం…

కేదార్ నాథ్ యాత్రలో క్రొత్తగా వచ్చిన ప్రయాణ మాధ్యమం.. ఇలా బుక్ చేసుకోండి!!

స్వచ్చమైన గంగా జలం లీటర్‌ బాటిల్‌ ఎంత?! ఒక్క చుక్క నాలుకపై పడితే చాలు పాపాలు తొలగిపోతాయి!

తిరుమల శ్రీవారి కానుకల వేలం! ఏమేమి వస్తువులు? ఎలా దగ్గించుకోవాలి? | TTD Updates

తిరుమలలో నియమాలతో కూడిన గదుల అద్దె మరియు లడ్డుల విక్రయం

కాశీ ప్రసాదం మరియు పేరులో మార్పు! | Kashi Prasadam and Change in Name of Prasad!