శ్రీవారి భక్తుల కోసం టిటిడి కొత్తగా తీసుకున్న కీలక నిర్ణయాలు

0
6622
TTD Taken Many Important Decisions
TTD Board Meeting – Approved Details

TTD Taken Many Important Decisions

టిటిడి కొత్తగా తీసుకున్న కీలక నిర్ణయాలు

వేసవి కాలం కావడంతో భక్తుల రద్ధీ పెరుగుతుంది. అందుకే టిటిడి పాలకమండలి సమావేశం అయింది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు కొన్ని నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. అవి ఏమిటంటే,

1. శ్రీ పద్మావతి వైద్య కళాశాల అభివృద్ధి పనులకు రూ.53.62 కోట్లు. ఇందులో భాగంగా టిబి, చెస్ట్, స్కిన్ ఇతర ఐసోలేషన్ వార్డులు, స్టాఫ్ క్వార్టర్స్, హాస్టళ్ల నిర్మాణ పనులు.
2. టిటిడి అవసరాల నిమిత్తం కోసం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల ఉత్పత్తుల కొనుగోలుకు, ధరల నిర్ణయంపై రైతు సాధికార సంస్థ, మార్క్ ఫెడ్ తో చర్చించేందుకు టీటీడీ బోర్డు సభ్యులు డా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి , శ్రీ సనత్ కుమార్, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో ఒక కమిటీని ఏర్పాటు చేసారు.
3. అలిపిరి మార్కెటింగ్‌ గోడౌన్‌ వద్ద నూతన గోడౌన్ల నిర్మాణానికి రూ.18 కోట్లు మరియు కోల్డ్‌ స్టోరేజి నిర్మాణానికి రూ.14 కోట్లు మంజూరు చేశారు.
4. గుంటూరుకు చెందిన దాత శ్రీమతి ఆలపాటి తారాదేవి ఇచ్చిన రూ.10 లక్షలతో వెండి కవచాన్ని శ్రీ బేడి ఆంజనేయస్వామి వారికి అందించేందుకు ఆమోదం.
5. తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ ఆలయ ఆధునీకరణ పనులకు రూ.3.12 కోట్లతో టెండరు.
6. న్యూఢిల్లీలోని ఎస్వీ కళాశాలలో ఆడిటోరియం అభివృద్ధి పనుల కోసం రూ.4 కోట్లు మంజూరు.
7. టిటిడి విద్యాసంస్థల్లో రెగ్యులర్‌ బోధనా సిబ్బంది నియామకం. కాంట్రాక్ట్ బోధనా సిబ్బందిని కొనసాగిస్తూనే రెగ్యులర్ ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
8. ఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మే 3 నుంచి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
9. తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీనివాస సేతు పనులను త్వరగా పనులు పూర్తి చేసి జూన్ 15వ తేదీ లోపు భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనే నిర్ణయానికి వచ్చారు.
10. ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో జరిగిన శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించిన అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులను అభినందించారు.
11. SCRA (విదేశీ విరాళాల స్వీకరణ చట్టం) ప్రకారం విదేశీ భక్తుల నుండి విరాళాలు స్వీకరించడానికి టిటిడికి అనుమతి ఉందన్నారు. ఈ అనుమతి 2020 జనవరికి ముగిసిందని, దీనిని రెన్యువల్ చేసుకోవడానికి టిటిడి దరఖాస్తు కూడ చేసిందని గుర్తు చేశారు.

Related Posts

విజయవాడ దుర్గమ్మ గుడిలో ఇవి రంగులు మారుతున్నాయి? ఇది దేనికి సంకేతం?!

తిరుమల శ్రీవారి ఆర్జిత, వర్చువల్ సేవా టికెట్లపై టీటీడి కీలక నిర్ణయం!! | TTD Updates

టీటీడీ వెబ్ సైట్లో టికెట్లు బుక్ చేస్తున్నారా? మొదటగా ఇది తెలుసుకోండి.

టీటీడీ కీలక ప్రకటన : శ్రీవారి దివ్య-సర్వ దర్శనం టోకెన్ల జారీలో మార్పు | TTD Updates

శ్రీవారి భక్తులకు 19 రోజులు పండగే..తిరుమలలో భాష్యకారుల ఉత్సవాలు!! Bhashyakarla Utsavam 2023

తిరుమల శ్రీవారి భక్తులకు రెండు శుభవార్తలు..లడ్డుతో పాటు మరో ప్రసాదం…

కేదార్ నాథ్ యాత్రలో క్రొత్తగా వచ్చిన ప్రయాణ మాధ్యమం.. ఇలా బుక్ చేసుకోండి!!

వీళ్లతో జాగ్రత్త! తిరుమల శ్రీవారి స్పెషల్ దర్శనం టికెట్ అంటే ఆశపడ్డ భక్తులు కాని డబ్బులిచ్చాక చూస్తే..

స్వచ్చమైన గంగా జలం లీటర్‌ బాటిల్‌ ఎంత?! ఒక్క చుక్క నాలుకపై పడితే చాలు పాపాలు తొలగిపోతాయి!

తిరుమల శ్రీవారి దేవస్థానానికి ఆర్బీఐ జరిమానా..! భక్తుల ఆ చెల్లింపులే కారణమా..?

తిరుమల శ్రీవారి కానుకల వేలం! ఏమేమి వస్తువులు? ఎలా దగ్గించుకోవాలి? | TTD Updates

తిరుమలలో నియమాలతో కూడిన గదుల అద్దె మరియు లడ్డుల విక్రయం

2023లో గంగా పుష్కరాలు పూర్తి వివరాలు | Ganga Pushkaralu 2023 | పుష్కరాలలో చెయ్యవలసిన విధులు

కాశీ ప్రసాదం మరియు పేరులో మార్పు! | Kashi Prasadam and Change in Name of Prasad!