
Why Shivratri Jagaran?
1శివరాత్రి నాడు జాగరణ ఎందుకు చేయాలి? మరునాడు నిద్రపోకూడదా?
శివరాత్రిలో ప్రధానమైన నియమాలు ఉపవాసం, జాగరణ. జాగరణ వ్రతం మహాశివరాత్రికి మాత్రమే కాక వైకుంఠ ఏకాదశికి కూడా నియమంగా చెప్పారు. అలాగే కొన్ని నోములలో కూడా జాగరణ ఉండాలి అని చెప్తారు. కొన్ని మంత్రదీక్షలలో, ఉపాసనా సంప్రదాయాలలో జాగరణ ఒక వ్రతం. ఇది అహోరాత్రవ్రతంగా చేస్తూ ఉంటారు. లక్షవర్తి పూజ ఇత్యాదులు చేసినప్పుడు కూడా రాత్రి జాగరణ ప్రత్యేకించి చెప్పారు. పగలు, రాత్రి కూడా మెలకువ కలిగి పరమాత్మను ఆరాధించడం అనేదే దీనిలో ప్రధానమైన ఉద్దేశం.
ఉపవసించి, జాగరణ చేసి ఒక రోజును నాలుగు గంటలకు ఒకమారు చొప్పున ఆరు భాగాలు చేసి షట్కాల శివపూజ చేయడం కనిపిస్తుంది. అలా వచ్చినప్పుడు అర్ధరాత్రి సమయం కూడా పూజ వస్తున్నది. అలా పూజ చేస్తూ కాలం గడపడం, దానితోపాటు భగవత్ సంకీర్తన, జపము, శివక్షేత్రములు సంచరించడము, శివాలయంలో ఉండడం, ఏదోవిధంగా శివమయంగా, శివభావనతో కూడిన జాగరణ చేయాలి.
శివరాత్రి జాగరణం వెనుక అసలు కారణం? (Reason Behind Shivratri Jagaran?)
శివుడు నిత్యజాగరూకుడు. ప్రళయకాలంలో ప్రపంచానికి విశ్రాంతి ఇస్తాడు. పిల్లవాడు అంతవరకూ ఆడుకున్నాక తల్లి ‘అలసిపోయావురా!’ అని పడుకోబెడుతుంది. అదేవిధంగా ఈ ప్రపంచం అంతా అలసిపోయాక విశ్రాంతినిచ్చేవాడు పరమాత్మ. విశ్రాంతిలో మళ్ళీ మరుసటి రోజుకు శక్తి పుంజుకుంటాం. అలాగే ప్రపంచానికి విశ్రాంతినిచ్చి తరువాత సృష్టికి కావలసిన శక్తినంతాప్రోది చేసి సృష్టిస్థితిలయకారకుడైన పరమాత్మ అయిన సదాశివుడు అనుగ్రహిస్తూ ఉంటాడు.
ప్రపంచానికి అంతటికీ విశ్రాంతినిస్తాడు కానీ, ఈయనకి విశ్రాంతి లేదు. ఎప్పుడూ మెలకువగా ఉంటాడు. శివుడు అంటే నిత్యజాగరూకుడు. ఆయనకి నిద్రలూ లేవు, మేలుకొలుపులూ లేవు. పైగా జ్ఞానస్వరూపుడు. జ్ఞానం ఎప్పుడూ జాగరణశీలమై ఉంటుంది. నిత్యజాగరూకుడైన పరమేశ్వరుని భావన చేసేటప్పుడు ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ రోజున ఆ నిత్యజాగరూకుడు మనకి కావాలి గనుక జాగరణ వ్రతం చేసి అనేక పాపాలను పోగొట్టుకుంటాం. దీనిని తాత్త్వికంగా అన్వయించితే చాలా అంతరార్థాలున్నాయి.
శివరాత్రి జాగరణం ఎలా చేయాలి? (How to Do Shivratri Jagaran?)
రాత్రియందు మెలకువగా ఉండుట అంటే ధ్యానస్థితి యందు ఏకాగ్రముగా ఉండుట. నిద్ర అంటే తెలియని లక్షణం, మెలకువ అంటే తెలిసిన లక్షణం. ఏమీ తెలియని అజ్ఞానావస్థ కాకుండా పూర్తి జ్ఞానావస్థలో ఉండాలి అనేది తాత్త్వికమైన అంతరార్థం. అయితే భౌతికమైన అర్థమూ ఉంది – మెలకువగా ఉండడం అని. అది చేస్తే దానికీ ఒక ఫలితం ఉన్నది గనుక ఈ రెండు అర్థాలూ అన్వయించుకోవాలి. మొట్టమొదట బాహ్యార్థం తీసుకొని క్రమంగా యోగార్థంలోకి అన్వయించుకోవాలి. ఇది జాగరణలో ఉన్న పరమార్థం.
అయితే ఎప్పుడూ దివానిద్ర (పగటి నిద్ర)ను మన శాస్త్రం చెప్పలేదు. దివానిద్ర ప్రోత్సాహకరమూ కాదు, మెచ్చుకోదగిన విషయమూ కాదు. కనుక మరుసటిరోజు పగలు నిద్రపోవచ్చా? అనే ప్రశ్నే లేదు. నియమం ప్రకారం మరుసటిరోజు రాత్రి నిద్రపోవాలి. అయితే పారణతో వ్రతం పూర్తయింది గనుక కొందరు అశక్తులు కాస్త కునికినా దానిని పెద్ద దోషంగా స్వీకరించవలసిన అవసరమేమీ లేదు.
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
Follow HariOme WhatsApp Channel
Related Posts
What are the Benefits of Shivaratri Fasting | What is the Right Way to do it?
Story to Read on Shivaratri in Telugu | శివరాత్రి రోజు చదవవలసిన కథ
Sri Siva Sahasranama Stotram Uttara Peetika | శ్రీ శివ సహస్రనామ స్తోత్రం ఉత్తర పీఠిక
Sri Siva Sahasranama Stotram Poorva Peetika | శ్రీ శివ సహస్రనామ స్తోత్రం పూర్వపీఠిక
శివునికి రుద్రాభిషేకం ఎందుకు చేస్తారు ? | Siva Rudrabhishekam benefits in Telugu
Benefits of Shivaratri Fasting? | శివరాత్రి ఉపవాసం ఏ విధంగా చేస్తే ఫలితం ఉంటుంది?
శ్రీ శివ షోడశోపచార పూజ – Sri Shiva Shodasopachara Puja Vidhanam
శ్రీ శివ అష్టోత్తర శతనామావళిః – Sri Shiva Ashtottara satanamavali
Sri Samba Sada Shiva Aksharamala Stotram | శ్రీ సాంబసదాశివ అక్షరమాలా స్తోత్రం