అయ్యప్ప స్వామివారి మోకాళ్ల ఎందుకు కట్టి ఉంటాయో తెలుసా? | Why did Lord Ayyappa Swamy legs tied in Telugu

2
5028
Why did Lord Ayyappa Swamy legs tied in Telugu

Why did Lord Ayyappa Swamy Legs Tied

అయ్యప్ప స్వామి:

మిగిలిన దేవతామూర్తులతో పోలిస్తే శ్రీ అయ్యప్పస్వామివారు యోగాసనంలో కూర్చుని, చిన్ముద్ర ధారియై భక్తులకు అభయమిస్తుంటారు. అయ్యప్పస్వామి వారి మోకాళ్ల చుట్టూ ఒక బంధనం ఉంటుంది.

దాన్ని ‘పట్టు బంధనం’ అంటారు. పందళ రాజు వద్ద పన్నెండు సంవత్సరములు పెరిగిన శ్రీ మణికంఠుడు తాను హరిహరసుతుడనని, ధర్మాన్ని శాసించుట కోసం ఆవిర్భవించానన్న సత్యాన్ని నారద మహర్షి ద్వారా తెలుసుకుంటారు.

మహిషిని వధించిన తర్వాత శబరిమల ఆలయంలో చిన్ముద్ర దాల్చి యోగాసన పద్ధతిలో జ్ఞాన పీఠముపై కూర్చుని భక్తులను అనుగ్రహిస్తుంటారు.

శబరిగిరిపై ఆలయం కట్టించి, స్వామి ఆభరణములను మోసుకుంటూ పద్దెనిమిది మెట్లెక్కి పందళరాజు వస్తారు. తండ్రి అయిన పందళరాజు రాకను గుర్తించిన స్వామివారు యోగాసనం నుంచి లేచి నిలబడటానికి ప్రయత్నిస్తారు.

అంతట పందళరాజు స్వామివారిని నిలువరించి తన భుజాన ఉన్న పట్టు వస్త్రంతో శ్రీస్వామివారి మోకాళ్లకు ఆ వస్త్రం చుట్టి బంధిస్తారు.

తాను ఇక్కడ అయ్యప్పస్వామిని ఏ విధంగానైతే చూసి తరించిపోయానో అదేవిధంగా మిగిలిన భక్తులు ఇదే రూపంలో స్వామివారిని చూసి తరించిపోవాలని అయ్యప్పస్వామిని ప్రార్థించగా, ఆయన అనుగ్రహించారట.

అలా కట్టి ఉన్నదానిని పట్టు బంధం అంటారు. దీన్ని శివకేశవులను ఐక్య పరిచిన బంధమని కూడా అంటారు.

Related Stories

Ayyappa Swami rituals| కుటుంబంలో మరణం జరిగితే, స్వామి మాలను కొనసాగించాలా?

Ayyappa Deeksha | భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త అయ్యప్ప మాల వేసుకుంటే ఏమవుతుంది?

Ayyappa Swamy Temple |ఆంధ్ర శబరిమలగా ప్రసిద్ధి గాంచిన ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయ రహస్యాలు.

అయ్యప్ప జననం & విగ్రహ రహస్యం | Birth History of Lord Ayyappa

Sri Ayyappa Ashtottara Satanama Stotram | శ్రీ అయ్యప్ప అష్టోత్తర శతనామ స్తోత్రం

శబరిమల ఆలయానికి 18 సంఖ్యకు సంబంధం ఏమిటి? | What Does the Number 18 Have to do With Sabarimala Temple?

 

2 COMMENTS

  1. చాలచాలంచివిశయాలను సెలవిచ్చిందులకు ృతజ్ఞతలుతెలియేసుకొనువున్నాను.

  2. చాల మంచి విషయము చెప్పారు ధన్యవాదములు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here