
Ugadi Slokam in Telugu
1. ఉగాది అంటే ఏమిటి? (What is Ugadi?)
ఉగాది నాడు ఈ శ్లోకాన్ని చదివి ఉగాది పచ్చడిని తీసుకోవాలి. ‘బ్రహ్మ ప్రళయం’ పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించే సమయాన్ని ‘బ్రహ్మకల్పం’ అంటారు ఇలా ప్రతికల్పంలోనూ మొదటవచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభసమయాన్ని ‘ఉగాది’ అని వ్యవహరిస్తారు.
ఈ ‘ఉగాది’ పండుగ మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆరోజు నుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి, లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషులు ఏర్పాటు చేశారు. లక్ష్మీప్రాప్తికి, విజయసాధనకు చైతన్యం కావాలి. జీవునకు చైతన్యం కలిగించేది కాలం ముఖ్యంగా ఉగాది సమయం గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయి.
ఉగాది రోజున పటించవలసిన శ్లోకం (Sloka to be Recited While Eating Ugadi Pachdi)
శ్లోకం
శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ
సర్వారిష్ట వినాశాయనింబకం దళబక్షణం
2025 తెలుగు సంవత్సరం పేరు & ఎప్పుడు (What is 2025 Telugu Year Name & When is Starting Date)
తెలుగు నూతన సంవత్సరం పేరు “విశ్వావస ” నామ సంవత్సరం. దీని యొక్క అర్ధం “ధనం సమృద్దిగా ఉండును ”
ఆదివారం, మార్చి 30, 2025 ఉగాది
ప్రతిపాద తిథి ప్రారంభం – మార్చి 29, 2025న 16:27
ప్రతిపాద తిథి ముగుస్తుంది – మార్చి 30, 2025న 12:49
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.