Ugadi Songs
1. ఉగాది పాటలు
సంవత్సరాదిలో వచ్చే యుగాది దాన్నే ఉగాది అంటాం. కొత్త చిగుళ్లు, కొత్త వేపపూత, కొత్తబెల్లం, కొత్త మామిళ్ల అంతా కొత్తదనంతో మురిపిస్తూ ప్రకృతి పచ్చదనంతో పరవశించిపోతూ గండుకోయిలలు వగరుపూతలని తిని కొత్తరాగాలు పాడుతూ ఉంటే చైత్రమాసం చిత్రమాసం సుమా! అనిపిస్తుంది. తెలుగువారికి అత్యంత ప్రీతికరమైన ఈ పండుగమీద ఉన్న కొన్ని సంప్రదాయ పాటలు మీకోసం.
ఉగాది పాట (Ugadi Song)
ఉగాది పండుగ వచ్చింది!
ఊరికి అందం తెచ్చింది!
ఉత్సవాలతో దేవుళ్లకు!
ఊరేగింపులు సాగాయి!
గుడిలో దేవుని పూజించి!
గురువుల పెద్దల రావించె!
పంచాంగాలను చదివించె!
మంచీచెడ్డలు విన్నాము!
అక్కలు,బావలు ఆశలతో
చక్కావచ్చారు పండుక్కి!
అమ్మవేకువ లేచింది!
అందరికి తలలు కడిగింది!
సరిపడే నగలు ఇచ్చింది!
సరిక్రొత్త బట్టలు పెట్టింది!
కులదేవతలను కొలిచింది!
గొప్పగా పూజలు చేసింది!
ఊటలు నోట్లో ఊరంగా!
ఉగాది పచ్లడిపెట్టింది!
ఉగాది పండుగ వచ్చింది!
ఊరికి అందం తెచింది!
(డాక్టర వెలగా వెంకటప్పయ్యగారి పిల్లల జానపద సర్వస్వంలో దొరికిన ఉగాది పాట)
వసంత కాలం
వసంతకాలం రాగారాగా
కిలకిలలాడును కీరములు
వసంతకాలం రాగారాగా
కలకలపూయును కలువములు
వసంతకాలం రాగారాగా
పికములు కుకుయని కూయున్
వసంతకాలం రాగారాగా
జనులకి కలుగు సంతసము
పాట
ఉగాది పండుగ వచ్చింది
వేపా బజ్జీ తిన్నాం
అమ్మానాన్న బావా అక్కా
కోతబట్టలు కట్టాం
పిండివంటలు తిన్నాం
2025 తెలుగు సంవత్సరం పేరు & ఎప్పుడు (What is 2025 Telugu Year Name & When is Starting Date)
తెలుగు నూతన సంవత్సరం పేరు “విశ్వావసు” నామ సంవత్సరం. దీని యొక్క అర్ధం “ధనం సమృద్ధిగా ఉండును”
ఆదివారం, మార్చి 30, 2025 ఉగాది
ప్రతిపాద తిథి ప్రారంభం – మార్చి 29, 2025న 16:27
ప్రతిపాద తిథి ముగుస్తుంది – మార్చి 30, 2025న 12:49